నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. సంయుక్త మీనన్మూవీ లో హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీన రాత్రి నుండి ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం మొదట ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో మరియు రెగ్యులర్ షోలకు సంబంధించి టికెట్ బుకింగ్స్ ను కూడా మూవీ బృందం వారు ఓపెన్ చేశారు.

అంతా సజావుగా జరుగుతుంది అనుకునే లోపే ఈ మూవీ విడుదల క్యాన్సిల్ అయింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను డిసెంబర్ 11వ తేదీన రాత్రి నుండి ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అఖండ 2 మూవీ డిసెంబర్ 5 వ తేదీన విడుదల అవుతుంది అనే ఉద్దేశంతో డిసెంబర్ 12 వ తేదీన చాలా చిన్న సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన మొగ్లీ మూవీ ని డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు.

ఇక అఖండ 2 డిసెంబర్ 12 న విడుదల కానుండడంతో మోగ్లీ సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేయాలి అనే వార్తలు రావడంతో సందీప్ రాజ్ తీవ్రంగా మనస్థాపం చెంది ఓ పోస్ట్ పెట్టాడు. దానిపై చాలా మంది చాలా రకాలుగా ఆయన గురించి స్పందించారు. నిన్న రాత్రి సందీప్ రాజు మాట్లాడుతూ ... నేను బాలయ్యను ఏమీ అనలేదు. నా సినిమా విడుదల వాయిదా పడుతుందేమో అనే ఉద్దేశంతో భావోద్వేగానికి గురయ్యాను. అంతే తప్ప నేను ఎవరిని విమర్శించలేదు. అందరిపై నాకు చాలా గౌరవం ఉంది అని ఆయన చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: