టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని నవంబర్ 27 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు మంచి టాక్ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే వచ్చింది. దానితో ఈ మూవీ తో రామ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడు అని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర దక్కలేదు. రామ్ ఈ మధ్య కాలంలో నటించిన చాలా సినిమాలు వరుసగా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఇక రామ్ నటించిన ఆఖరి కొన్ని మూవీలకు విడుదల అయిన మొదటి రోజే మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఆ సినిమాలకు మంచి కలెక్షన్లు దక్కలేదు. కానీ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కి మంచి టాక్ వచ్చినా కూడా ఈ సినిమా రామ్ కెరియర్ లో భారీ అపజయాలను అందుకున్న సినిమాల రేంజ్ కలెక్షన్లను కూడా అందుకోలేదు అని తెలుస్తుంది. రామ్ కెరియర్ లో భారీ అపజయాలను అందుకున్న సినిమాలలో ది వారియర్ మూవీ ఒకటి. ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 31.4 కోట్ల కలెక్షన్లను వసులు చేసి ఫ్లాప్ గా నిలిచింది.

ఇక రామ్ కెరియర్ లో మరో ఫ్లాప్ మూవీ గా నిలిచిన సినిమాలలో స్కంద మూవీ ఒకటి. ఈ సినిమా 55.7 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా మంచి టాక్ ను తెచ్చుకున్న కేవలం 30 కోట్ల కలెక్షన్లను మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ సినిమా కూడా రామ్ కెరియర్ లో భారీ ప్లాప్ మూవీల లిస్టులో చేరిపోయే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: