మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కాపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా కాలం క్రితమే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

పెద్ది , ది ప్యారడైజ్ రెండు మూవీలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాల విడుదల తేదీలు అత్యంత దగ్గరగా ఉండడంతో ఈ రెండు మూవీలలో ఏదో ఒకటి డ్రాప్ అయితే బెటర్ లేదంటే రెండు సినిమాల కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం పెద్ది సినిమాను మార్చి 27 వ తేదీన కాకుండా మరో తేదీన విడుదల చేయాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

కాకపోతె మార్చి 26 వ తేదీన పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న  ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ది సినిమా తప్పుకోవడంతో దాదాపు ఆ సినిమా కంటే ఒక రోజు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు రావడంతో అది నాని కి మరింత డేంజర్ అని , కనీసం పెద్ది సినిమా ది ప్యారడైజ్ మూవీ విడుదల అయిన తర్వాత రోజు అయ్యేది కాబట్టి ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని మార్చి 26 వ తేదీన విడుదల చేస్తే ది ప్యారడైజ్ సినిమా ఓపెనింగ్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: