బాలీవుడ్లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ధురంధర్. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హీరోగా నటించగా ,మాధవన్ కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆదిత్యధర్ తెరకెక్కించారు.ఇటీవలే బాలీవుడ్ లో విడుదలైన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటోంది. కానీ ఇలాంటి సినిమాని ఏకంగా 6 దేశాలలో మాత్రం నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది. 6 దేశాలలో గల్ఫ్ దేశం కూడా ఒకటి. మరి ఈ సినిమాని ఎందుకు బ్యాన్ చేశారో ఇప్పుడు ఒకసారి చూద్దాం


ధురంధర్ చిత్రం 1999లో జరిగిన IC -814 విమానం హైజాక్, 2001 లో జరిగిన పార్లమెంటు ఉగ్రదాడి సంఘటనల తర్వాత పాకిస్థాన్ చావదెబ్బ కొట్టేందుకు ఉగ్రవాద స్థలాల్ని సమూలంగా అంతం చేసేందుకు ఏం చేశారు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్గా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా భారీగానే రాబట్టింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.185  కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడినట్లు వినిపిస్తోంది. ఓటిటి ధర కూడా భారీగానే నెట్ ఫ్లిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇలాంటి సినిమాని బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, ఖాతార్  తోపాటుగా యూఏఈ వంటి ప్రాంతాలలో నిషేధించినట్లు బాలీవుడ్ మీడియా తెలియజేసింది.



బాలీవుడ్ చిత్రాలకు కీలకమైన మార్కెట్ గా ఉన్న గల్ఫ్ లో కూడా చాలా థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నించిన పర్మిషన్ లభించడం లేదట. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఈ సినిమాని తీయడం వల్లే ఆ దేశాలు ఈ సినిమాని బ్యాన్ చేశాయని సమాచారం. ఇలా గల్ఫ్ దేశాలలో కూడా ధురంధర్ సినిమాకి ఎదురు దెబ్బ తగిలినప్పటికీ ఇండియాలో మాత్రం కలెక్షన్స్ భారీగానే రాబడుతోంది. మరో రెండు మూడు రోజులలో ఈ సినిమా 200 కోట్ల క్లబ్బులోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: