నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 ఈ సినిమా ఈ రోజున (డిసెంబర్ 12) న విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఉదయం నుంచి బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఈ సినిమా చేయడానికి గల కారణాన్ని తెలియజేశారు.



బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. మన ధర్మం, మన వేదం, మన దేశం, మన దైవం వీటన్నిటి మీదే ఈ సినిమా నిర్మించానని తెలిపారు. ఈ సినిమా గురించి మొదట చెప్పినప్పుడే ఇది సినిమా కాదు భారతదేశ ఆత్మ అని చెప్పానని తెలిపారు. భారతదేశ మూలమూలలా చూశారు కానీ, మూలాన్ని చూడలేదు. ఆ మూలమే మన దైవం. అది ఏంటి అని చెప్పేది మన కథ అంటూ తెలిపారు బోయపాటి శ్రీను. ధర్మం గురించి, వేదం గురించి ఇప్పుడు చెప్పకుండా ఎప్పుడు చెబుతాం అనే ఉద్దేశం నుంచి ఈ సినిమా పుట్టిందంటూ బోయపాటి శ్రీను తెలిపారు.సినిమాకి సంబంధించి అన్ని లాజిక్కులను చూసే సెట్ చేసుకున్నాను అంటూ తెలియజేశారు బోయపాటి శ్రీను.


ఇందులో నందమూరి బాలయ్య నటన అద్భుతంగా ఉందని, బాలయ్య చెప్పే డైలాగులు యాక్షన్ సీన్స్ కూడా అందరిని ఆకట్టుకుంటాయి. అఘోర పాత్రలో కూడా బాలయ్య అద్భుతంగా నటించారు. ఏకంగా విలన్ గా నటించిన ఆదిపినిశెట్టినే డామినేట్ చేసేలా నటించారు బాలయ్య. ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ హైలెట్ గా ఉంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కూడా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించేలా ఉంటాయి. సంయుక్త మీనన్, జగపతిబాబు, పూర్ణ తదితర నటీనటులు నటించారు.అఖండ 2 సినిమా ప్రీమియర్ షోలతోనే సుమారుగా రూ .10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబడినట్లు వినిపిస్తున్నాయి. మరి మొదటి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: