బాలయ్య ,బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 సినిమా (డిసెంబర్ 12 ) న పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి సంబంధించి స్పెషల్స్ ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.

బాలయ్య బాబుకి ఎవరైనా డైరెక్టర్ సినిమా స్టోరీ క్లారిటీ చెబితే చాలు చెప్పింది.. చెప్పినట్టుగా చేసుకుంటూ పోతారని తెలిపారు. క్లారిటీ లేనప్పుడే నందమూరి బాలకృష్ణ గారు బయటకి వస్తారని బోయపాటి శ్రీను తెలిపారు. అఖండ సినిమా చేయడానికి ముఖ్య కారణం బాలయ్యబాబు గారే.. ఆయన కూడా ఏదైనా క్వశ్చన్ చేసి ఉంటే నేను ఈ సినిమా చేసేవాడిని కాదు. బాలయ్య దగ్గరికి వెళ్లాను సింహ, లెజెండ్ సినిమా చేసాము. ఇప్పుడు మూడవ సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అవుతుంది. ఆ తర్వాత మనం చేయడానికి ఏ సినిమా ఉండదంటూ చెప్పానని తెలిపారు బోయపాటి శ్రీను.


కానీ బాలయ్య ఆ తర్వాత మన జర్నీ ఆగిపోకూడదు ఏదైనా కథ ఉంటే చేద్దామని చెప్పగా అప్పుడు తన దగ్గర ఉన్న అఘోర కథ గురించి చెప్పానని తెలిపారు బోయపాటి శ్రీను. మొదట అఘోర పాత్ర గురించి కొన్ని విషయాలలో ఆలోచించిన బాలయ్య, కానీ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో అలాంటి అఘోర పాత్ర ఉండదు.. కేవలం మనం చూస్తోంది బయట ఉన్న వాళ్లను మాత్రమే అసలు వాళ్ళు వేరే ఉన్నారు. భారతదేశ రక్షణ కోసం వారు ఎంత చేస్తున్నారు నాకు ఐడియా ఉంది , అందుకు సంబంధించి నేను చదివాను అంటూ బాలయ్యకు చెప్పానని తెలిపారు బోయపాటి.


ఇక వెంటనే బాలయ్య బాబు కూడా ఎప్పుడు మేకప్ టెస్ట్ అని అడిగారు. ఇక తర్వాత మేకప్ టెస్ట్ వేసిన తర్వాత కూడా లైవ్ లో చూడమని అడిగినా కూడా బాలయ్య ఎందుకు మీరున్నారు చూసుకుంటారని చెప్పి వదిలేసారని తెలిపారు బోయపాటి శ్రీను. ఇంతే కథ కూడా వినలేదు మొత్తం సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత చూశారని తెలిపారు. ఆయన నా మీద పెట్టిన నమ్మకమే అఖండ సినిమా అంటూ తెలిపారు. లేకపోతే అంత గొప్పగా చేయలేనంటూ తెలిపారు బోయపాటి శ్రీను. అఖండ 2 తాండవం కేవలం 140  రోజులలోపే పూర్తి చేశానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: