టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య ఈ మధ్య కాలంలో అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజా అనే సినిమా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బాలయ్య "అఖండ 2" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల కాలేదు. తాజాగా ఈ మూవీ ని డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 500 కే ప్లస్ టికెట్లు బుక్ మై షో ఆప్ లో సేల్ అయినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇక ఈ మూవీ విడుదల పోస్ట్ పోన్ అయ్యి మళ్లీ విడుదల అయినా కూడా ఈ సినిమాపై ప్రేక్షకులు అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ చూపిస్తూ ఉండటంతో బాలయ్య అభిమానులు ఇది మా బాలకృష్ణ రేంజ్ అని తెగ సంతోష పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: