మతం అంటేనే దైవాన్ని పూజించడం, నమ్మకాలు, సాంప్రదాయాల వ్యవస్థ అని చెబుతూ ఉంటారు. భక్తి సినిమాలు చూడడం వల్ల ప్రజలలో మరింత మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇండియాలో కూడా ఇలాంటి సినిమాలకు భారీగానే డిమాండ్ ఉన్నది. పురాణాలు, ఇతిహాస కథలు, దేవత కథల ఆధారంగా తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేస్తున్నాయి. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులను కుటుంబంతో సహా సినిమాలకు తీసుకువచ్చేలా చేస్తున్నాయి. కానీ నేటి దర్శక నిర్మాతలు మాత్రం వీటికి కల్పితాలు జోడించి సినిమాలు తీయడం వల్ల అసలు సమస్యలు ఏర్పడుతున్నాయి.
రాబోయే కొన్ని సంవత్సరాల పాటు మరిన్ని పురాణ ఇతిహాస కథల ఆధారంగా తెరకెక్కించే సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ జోనర్ సినిమాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని సినీ పరిశ్రమ టార్గెట్ చేసుకొని, పురాణ కథలను తమకు అనుగుణంగా మార్చడం లేదా కొన్ని సందర్భాలలో తప్పుగా చూపించడం వంటి వాటి వల్ల వివాదాలకు దారితీస్తున్నాయి. 1990 దశకం ముందు ఎక్కువగా భక్తి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు భక్తి పేరుతో వచ్చే సినిమాలు చాలా వివాదాలకు దారితీస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు మన పురాణాలు ,ఇతిహాసాలను కూడా వక్రీకరిస్తున్నట్లుగా కొన్ని కల్పితాలను జోడించి మరి నిర్మిస్తున్నారు.
ఇటీవల మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా పూర్తిగా భక్తితో నిండిన సినిమా కావడం చేత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇప్పుడు ట్రెండ్ మాత్రం సనాతన ధర్మం, దేశభక్తి, యాక్షన్ టచ్ ఇలా ఏదో ఒక పాయింట్ తో ప్రేక్షకులను రిచ్ అయ్యేలా చూస్తున్నారు. అఖండ చిత్రంలో వీటన్నిటిని కలిపి కొట్టేయడంతో బాలయ్య ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇలాంటి సినిమాలలో మాస్ ఆడియన్స్ కోసం స్పెషల్ సాంగ్స్ పెట్టారు. కేవలం ఫ్యాన్స్ విజిల్స్ కోసమే దేవుడు పేరును ఉపయోగిస్తున్నారని, దేవుళ్లను కేవలం ఎలివేషన్ కోసమే దర్శకనిర్మాతలు ఉపయోగించడం ఏంటనే రావడం సహజమే..
అఖండ 2 చిత్రంలో బాలయ్య పాత్ర పరంగా బలంగా ఉంది. అయితే ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేందుకు ఈ చిత్రంలో హనుమాన్ గ్రాఫిక్స్ చేసి సరికొత్త సీన్ క్రియేట్ చేశారు. అక్కడ సీన్స్ లో స్కోప్ లేకున్నా హనుమాన్ ను చూపించడం చాలా విడ్డూరంగానే కనిపిస్తుంది. అఖండ చిత్రంలో శివుడు పాత్రను అద్భుతంగా చూపించారు. ఏకంగా భక్తురాలి కోసం భగవంతుడే దిగి వస్తారని చూపించిన తీరు అద్భుతం. కానీ అఖండ 2 లో అలా లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి