నాగార్జున తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మల జ్ఞాపకంగా ఆ కాలేజీకి నాగార్జున భారీ విరాళాన్ని గిఫ్ట్ కింద ఇచ్చారు. అయితే ఇది కేవలం ఆయన ఒక్క నిర్ణయమే కాదని తన సోదరుడు వెంకటేష్, సోదరి సుశీల ఇలా అక్కినేని కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలియజేశారు. నాగార్జున మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల క్రితం మా తండ్రి ఈ సంస్థ అభివృద్ధి కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. అది ఆ రోజుల్లో చాలా పెద్దది.. ఆయన వారసత్వంగా కొనసాగించడం అలాగే విద్యాసంస్థను నమ్ముకున్న విద్యార్థులకు అండగా నిలబడడం కూడా మా కుటుంబ బాధ్యత అంటూ తెలిపారు.
అందుకోసం రూ .2 కోట్ల రూపాయల నిధులను కేవలం ప్రకటనలకు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో అర్హులైన విద్యార్థులకు సైతం అందేలా చూస్తామంటూ తెలియజేశారు. అలాగే ఈ నిధిని సరైన పద్ధతిలో పార్యదర్శకంగానే విద్యార్థులకు అందేలా చేయాలని యాజమాన్యంతో అక్కినేని కుటుంబం కలిసి పని చేస్తుందని తెలియజేశారు. ఆర్థికంగా వెనుకబడి చదువులో రాణించే విద్యార్థులకు ఈ ఆర్థిక సహాయం చాలా ఉపయోగపడుతుందని చెప్పడంతో అక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా నాగార్జునను ప్రశంసలు కురిపిస్తూ చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. దీంతో అభిమానుల సైతం మీరు నిజజీవితంలో కూడా ఒక కింగ్ అనిపించుకున్నారని ప్రశంసించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి