ఇటీవల వేణు స్వామి సమంత గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గతంలో సమంత - నాగ చైతన్య విడిపోతారు అని ముందుగా చెప్పింది ఈ వేణు స్వామీనే. అందుకే సమంత లైఫ్ లో ఏం జరిగినా మొదటగా ఈ వేణు స్వామీ పేరునే వినిపిస్తుంది. ఇప్పుడు సమంత దర్శకుడు రాజ్‌తో భూతశుద్ధి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాహంపై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి.


వేణు స్వామి మాట్లాడుతూ.. సమంత ఈ విధమైన వివాహం చేసుకోవడానికి కారణం ఆమె మాజీ భర్తేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూతశుద్ధి అనేది అసలు పెళ్లి కాదని తేల్చి చెప్పేశారు.  అది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమేనని ఆయన కుండ బద్ధలు కొట్టిన్నట్లు తెలిపారు. గతంలో ఎవరి వల్లైనా మనకు దరిద్రం లేదా నెగెటివ్ ఎనర్జీ అంటుకున్నట్లయితే, దాన్ని తొలగించుకోవడానికి చేసే ఒక విధానమే భూతశుద్ధి అని ఆయన వివరించారు.  అలాగే, ఏదైనా వ్యక్తి వల్ల మన జీవితంలో నష్టం, బాధ లేదా కష్టాలు ఎదురైతే, వాటి నుంచి బయటపడటానికి ఈ ప్రక్రియను అనుసరిస్తారని చెప్పారు. దీంతో ఆయన మాట్లాడిన మాటలు బాగా హీట్ పెంచేస్తున్నాయి.



ఈ నేపథ్యంలోనే సమంత తన మాజీ భర్త కారణంగా ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ భూతశుద్ధి వివాహాన్ని చేసుకుందని వేణు స్వామి పరోక్షకంగా వ్యాఖ్యానించినంట్లైంది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. వేణు స్వామి ఇంటర్వ్యూ వీడియోల కింద నెటిజన్లు అనేక ప్రశ్నలు వేస్తూ, “నాగచైతన్య వల్ల సమంతకు ఎదురైన కష్టాల నుంచి బయటపడేందుకే ఆమె ఈ విధానాన్ని అనుసరించిందా?” అనే రీతిలో చర్చిస్తున్నారు. మొత్తానికి సమంత రెండో పెళ్లి అంశం మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. వేణు స్వామి వ్యాఖ్యలతో ఈ విషయం మరింత వైరల్‌గా మారి, అభిమానులు, నెటిజన్లు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుండగా, మరికొందరు మాత్రం ఆసక్తితో ఈ అంశాన్ని చర్చిస్తున్నారు. ఏదేమైనా, సమంత వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: