ఇండియన్ సిని పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉండే హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉంటారు. అలా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఇప్పటికి పలు చిత్రాలలో నటిస్తూ గ్లోబల్ స్థాయిలో హీరోయిన్గా పేరు సంపాదించింది. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇమే మందాకిని పాత్రలో కనిపించబోతోంది.


గతంలో ఒక పాడ్ కాస్ట్  ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా తాను పనిచేసే హీరోలందరితో కూడా డేటింగ్ చేశానని తెలిపింది. కానీ తాను ఎప్పుడూ ఒకే బంధంతో కొనసాగలేకపోయాను ,అలా ఒకరి సంబంధం నుంచి మరొక సంబంధానికి మారాను. సినిమా సెట్లో  ఎలా ఉండాలి సంబంధంలో ఉండే వ్యక్తులతో ఎలా ఉండాలి అనే విషయంపై నాకు ఒక ఆలోచన ఉంది. అలాంటి బంధం కోసం నేను వెతికాను కానీ నా జీవితంలో వచ్చే వ్యక్తుల ఆలోచనలు అర్థం చేసుకోవడానికి చాలానే ప్రయత్నించాను , గొప్ప నటులతో డేటింగ్ చేసిన ఆ సంబంధాలు చాలా దారుణమైన పరిస్థితులలో ముగిశాయని తెలిపింది ప్రియాంక చోప్రా. గతంలో కూడా పలువురు హీరోలతో డేటింగ్ చేసిందని విమర్శ కూడా ఉండేవి.


 ప్రియాంక భర్త (నిక్ జోనాస్) ప్రేమించడానికి ముందు తన చివరి డేటింగ్ బ్రేకప్ తర్వాత రెండేళ్ల పాటు ప్రేమకే దూరంగా ఉన్నానని తెలిపింది. నిక్ జోనాస్ తో వివాహమనంతరం బాలీవుడ్ కి దూరమై హాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తూ ఉండేది ప్రియాంక చోప్రా. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రియాంక చోప్రాకు సంబంధించి ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: