దీంతో ఈ సినిమాని ఇతర భాషలలో కూడా విడుదల చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దక్షిణాదిలో కూడా భారీ రెస్పాన్స్, కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా చూసిన చాలా మంది సెలబ్రిటీలు కూడా మాట్లాడడానికి మక్కువ చూపుతున్నారు. ఇటీవల హృతిక్ రోషన్ కూడా మాట్లాడుతూ సినిమా అంతా బాగానే ఉంది, కానీ పాలిటిక్స్ చూపించక పోయి ఉంటే బాగుండేదేమో అంటూ తెలిపారు.
హీరోయిన్ రాధిక ఆప్టే ఈ చిత్రంలో వయలెన్స్ చాలా దారుణంగా ఉందని , ఇలాంటి చిత్రాలు తన పిల్లలకు ఎలా చూపించాలి అంటు వెల్లడించింది. ఈ విషయంపై గతంలో ఈమె నటించిన బోల్డ్ సీడ్స్ గురించి విమర్శలు చేస్తున్నారు నేటిజన్స్. అయితే చాలామంది రివ్యూయర్లు ఇది కూడా సినిమానా అంటు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకి ఆదరణ రోజు పెరుగుతూనే ఉంది. ఇన్ని రోజులు హిందీ సినిమాలలో పాకిస్థాన్ ని దోస్తాన్గా చూపించేవారు. యష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఏక్ థాటైగర్, పఠాన్, వార్, వార్ 2, టైగర్ జిందా హై వంటి చిత్రాలను ఒకలాగా పాకిస్తాన్ని ప్రజెంట్ చేశారు. ఇందులో ఉగ్రవాదులు చూపించిన తీరు ఒకలాగా ఉంది. కానీ ధురంధర్ చూసిన తర్వాత జనాలకు కొన్ని విషయాలు క్లియర్ గా అర్థమవుతాయి.
ఈ చిత్రంలో నటించిన అక్షయ్ ఖన్నా, రణవీర్ సింగ్, సంజయ్ దత్ తో చాలామంది చిన్న పెద్ద యాక్టర్స్ ఇందులో నటించారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా బాలీవుడ్ స్టార్స్ చేసింది యాక్టింగ్ ఏనా అనిపించేలా చేశారు. ఈ చిత్రంలో ఎక్కడా కూడా మతం గురించి ప్రస్తావించలేదు. సామాన్య ప్రజలను రాక్షసులుగా చూపించలేదు. దాయాది దేశంలో ఒక ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేదనే విషయాన్ని మాత్రమే చూపించారు డైరెక్టర్ ఆదిత్య ధర్. బాలీవుడ్ పునాదులను కదిలించేలా ప్రయత్నం చేశారని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి