అక్కినేని నాగచైతన్య.. జోష్ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈయన కి ఎన్ని సినిమాలు చేసిన సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. ఈయన కెరియర్లో 100% లవ్, మజిలీ, లవ్ స్టోరీ, ఏ మాయ చేసావే,మనం,ప్రేమమ్ ఈ ఏడాది వచ్చిన తండేల్..ఈ సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. అయితే ఈ హిట్ సినిమాల్లో కూడా ఎక్కువ శాతం హీరోయిన్ వల్లే సినిమా హిట్ అయింది అనే టాక్ కూడా ఉంది. కానీ నాగచైతన్యకు అసలైన హిట్ తండేలు మూవీతో పడిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ ప్లస్ అయినప్పటికీ కూడా ఈ సినిమాలో తన యాక్టింగ్ తో ఇరగదీసారు. అలా చందూ మొండేటి డైరెక్షన్లో నాగచైతన్య హీరోగా.. సాయి పల్లవి హీరోయిన్ గా..అల్లు అరవింద్ సమర్పణలో గీత  ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాస్ నిర్మించిన తండేల్  మూవీ 2025 ఫిబ్రవరి 7న విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

 అయితే నాగచైతన్య నటించిన తండేల మూవీ రియల్ స్టోరీ.. శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి 22 మంది మత్స్యకారులు రాజు అనే వ్యక్తి నాయకుడిగా సముద్రంలో చేపల వేట కోసం మూడు బోట్లలో ప్రయాణం చేస్తారు. అదే సమయంలో గుజరాత్ వేరావాల్ నుంచి తమ ప్రయాణం స్టార్ట్ చేసి చేపల వేట కొనసాగిస్తున్న సమయంలో అనుకోకుండా పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశిస్తారు. దాంతో వీరిని గుర్తించినటువంటి పాకిస్తాన్ వాళ్లు అరెస్టు చేసి జైల్లో వేస్తారు. అదే సమయంలో పాకిస్తాన్ జైల్లో వీరికి ఎదురైన చేదు అనుభవాలు ఏంటి.. రాజు మిగిలిన మత్యకారుల కోసం పాకిస్తాన్లో ఎలాంటి యుద్ధం చేస్తారు..

వీరు పాకిస్తాన్ నుండి తిరిగి స్వదేశానికి ఎలా చేరుకుంటారు.. అనేది తండేల్ మూవీ లో చూపించారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య శ్రీకాకుళం యాసతో ఇరగదీసారు. అలాగే సాయి పల్లవి బుజ్జి తల్లి యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. అలా ఈ ఏడాది నాగచైతన్య కెరీర్లో 100 కోట్ల హిట్ మూవీ పడింది. ఈ మూవీతో నాగచైతన్య 100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోల లిస్ట్ లో చేరిపోయారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఈ సినిమా విడుదలయ్యే సమయానికి నాగచైతన్యకు శోభితతో రెండో పెళ్లి జరిగింది. ఇక ఈ సినిమా హిట్ కొట్టడంతో శోభిత రాక నాగచైతన్యకు కలిసొచ్చింది.. ఆయన జీవితాన్ని మార్చివేసింది అని చాలామంది మాట్లాడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: