టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇక తన తోటి సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లతో పోలిస్తే ఓ విషయంలో చిరంజీవి ఈ సంవత్సరం చాలా వెనకబడ్డాడు. అదేంటి అనేది తెలుసుకుందాం. అసలు విషయం లోకి వెళితే ... మెగాస్టార్ చిరంజీవి 2023 వ సంవత్సరం భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల చేయలేకపోయారు.

ఇప్పటికి కూడా ఈ సినిమా విడుదల కాలేదు. ఇక చిరంజీవి "విశ్వంభర" మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం లోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. దీనితో చిరంజీవి 2023 వ సంవత్సరం భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన తర్వాత 2024 వ సంవత్సరం చిరంజీవి నుండి ఒక్క సినిమా రాలేదు. 2025 వ సంవత్సరం కూడా చిరంజీవి నుండి ఒక్క సినిమా రాలేదు. ఇక తన తోటి సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున మాత్రం తమ సినిమాలతో ప్రేక్షకులను పలకరించి తమ అభిమానులను బాగా ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: