ఈ మూవీ కోసం గత కొన్ని నెలలుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. ఇండియా వ్యాప్తంగా ఓపెనింగ్స్ బాగానే ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, నార్త్ అమెరికా మార్కెట్‌లో మాత్రం ఈ సినిమాకు ఊహించని షాక్ ఎదురైంది.నార్త్ అమెరికాలో ‘రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్‌ను ప్రారంభించి రెండు వారాలు గడిచినా, ఇప్పటివరకు ఈ చిత్రానికి కేవలం 121 వేల డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ మాత్రమే నమోదైంది. వెయ్యికి పైగా థియేటర్లలో షోలు ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, ఇంత తక్కువ స్థాయిలో బుకింగ్స్ జరగడం ట్రేడ్ పండితులను అయోమయంలోకి నెట్టింది.
ప్రభాస్ గత చిత్రం ‘కల్కి’ నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారానే దాదాపు 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. అలాంటి స్టార్ హీరోకు ఇప్పుడు కనీసం 1 మిలియన్ డాలర్ల గ్రాస్ కూడా రావడం కష్టంగా మారుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి సినిమాపై నెగటివ్ టాక్‌ను పెంచే అవకాశముందని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఈ విషయాన్ని ట్రోల్స్‌గా మార్చుతున్నారు. అయితే, సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో ప్రమోషన్లు పెరిగితే పరిస్థితి మారుతుందా? లేక ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? అన్నది చూడాల్సి ఉంది. భారీ స్టార్‌డమ్, సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ, ‘రాజా సాబ్’ నార్త్ అమెరికా మార్కెట్‌లో ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరి చివరకు ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా? లేక ట్రేడ్ వర్గాల భయాలు నిజమవుతాయా? అన్నది సినిమా విడుదల తర్వాతే స్పష్టత రానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి