ఈ సినిమా బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుందని చిత్ర బృందం నమ్మకంగా తెలియజేస్తోంది. ఇటువంటి తరుణంలోనే ఈ సినిమా గురించి ఒక కీలకమైన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. సంక్రాంతికి పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. కానీ రవితేజ , నిర్మాత సుధాకర్ మాత్రం ఈసారి సామాన్య ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తన సినిమాను మరింత చేరువయ్యేలా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సినిమాకి ఎటువంటి రేట్లు పెంపు ఉండదని పాత సాధారణ ధరలకే ఈ సినిమా టికెట్లు లభిస్తాయని తెలియజేశారు.
పండుగ పూట కుటుంబ సమేతంగా థియేటర్ కి వచ్చి మరి ప్రేక్షకులు సినిమా చూడాలనుకునే వారికి ఇది పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంగీతాన్ని బీమ్స్ సిసిరోలియో అందించారు. అలాగే ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ తో పాటు సత్య వంటి కమెడియన్స్ కూడా నటిస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో బడా సినిమాలతో పోటీపడి రవితేజ సక్సెస్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా టికెట్ల సినిమా రేటు పెంచకపోవడం అనేది ఈ సినిమాకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉన్నది. మరి ట్రైలర్ తో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి