ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన వార్తలలో రష్మిక మందన్న–విజయ్ దేవరకొండ పెళ్లి ఒకటిగా నిలుస్తోంది. వీరిద్దరూ ఇప్పటివరకు తమ పెళ్లి విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఈ వార్తపై ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం, ఫిబ్రవరి 26న రష్మిక–విజయ్ వివాహం జరగబోతోందని సమాచారం. అంతేకాదు, ఈ పెళ్లిని చాలా గ్రాండ్‌గా, కానీ పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలని వారు భావిస్తున్నారట.


సాధారణంగా స్టార్ సెలబ్రిటీలు పెళ్లిళ్లను భారీగా ప్లాన్ చేస్తూ, ఆధునికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని అందరికీ తెలుసు. సాంప్రదాయాలను కొంతవరకు పక్కన పెట్టి, డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేదా లగ్జరీ స్టైల్‌ను ఫాలో అవుతుంటారు.కానీ ఈ విషయంలో రష్మిక–విజయ్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. తమ పెళ్లిని పూర్తిగా పాతకాలం సంప్రదాయాల ప్రకారం, శాస్త్రోక్తంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారట. ఐదు రోజుల పాటు జరిగే సంప్రదాయ వివాహ విధానాన్ని అనుసరిస్తూ, ప్రతి కార్యక్రమానికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. పెళ్లికి సంబంధించిన ప్రతి రీతిని సంప్రదాయబద్ధంగా జరపాలని వారు ప్రయత్నిస్తున్నారని టాక్.



ఒకవేళ ఈ వార్తలన్నీ నిజమైతే, ఇది ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టర్ మ్యారేజ్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ సెలబ్రిటీలు ఇలాంటి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటే, భవిష్యత్తులో మరెందరో సెలబ్రిటీలు అదే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఆధునికతతో పాటు సంప్రదాయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వవచ్చని ఇది ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది.అయితే ఇప్పటివరకు ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలే. రష్మిక–విజయ్ తమ పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేసే వరకు ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఆ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



మరి చూడాలి… ఈ హాట్ టాపిక్‌పై రష్మిక–విజయ్ ఎప్పుడు అధికారికంగా స్పందిస్తారో, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో!

మరింత సమాచారం తెలుసుకోండి: