కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ప్రస్తుతం జన నాయగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యం లో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఒక్కో దానిని విడుదల చేస్తూ వస్తున్నారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు. ఈ మూవీ నుండి మేకర్స్ తాజాగా "ఓరు పేరే వరలరు" అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 22.72 మిలియన్ వ్యూస్ ... 16.6 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే జన నాయగన్ మూవీ లోని సెకండ్ సింగిల్ కు విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతానికి జన నాయగన్ మూవీ పై విజయ్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: