సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా, రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నా, కొందరు హీరోయిన్లకు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు, విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకోవడం సాధ్యమవుతుంది. వారు సినిమాల్లో కనిపించకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినా కూడా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంటారు. అలాంటి అరుదైన హీరోయిన్ల జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సాయి పల్లవి.ప్రస్తుత తరం హీరోయిన్లలో టాప్ పొజిషన్‌లో ఉన్న సాయి పల్లవి, తన సహజమైన నటన, డాన్స్, మరియు సింపుల్ లుక్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. గ్లామర్‌కు దూరంగా ఉంటూనే, కథలో బలం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇదే ఆమెను మిగతా హీరోయిన్లకు భిన్నంగా నిలబెట్టింది.


అయితే గత కొంతకాలంగా సాయి పల్లవి సినిమాలకు కొంత దూరంగా ఉంటూ వస్తోంది. ఆమె చివరిగా నటించిన చిత్రం  ‘తండెల్’ .  తర్వాత ఆమె నుంచి పెద్దగా సినిమాల ప్రకటనలు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’ సినిమాకు కమిట్ అయ్యింది. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. బాలీవుడ్‌లోనూ తన నటనతో మరోసారి తన ప్రతిభను నిరూపించబోతున్నట్లు అభిమానులు ఆశిస్తున్నారు.



ఇదిలా ఉండగా, సాయి పల్లవికి తెలుగులో మూడు నుంచి నాలుగు వరకు భారీ బడ్జెట్ సినిమాల ఆఫర్లు వచ్చినప్పటికీ, వాటిని ఆమె తిరస్కరించిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది. సాధారణంగా చాలా మంది హీరోయిన్లు డబ్బు, క్రేజ్ కోసమే ఏ పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధపడతారు. కానీ సాయి పల్లవి మాత్రం అలాంటి హీరోయిన్ కాదు. తనకు నచ్చిన కథ, బలమైన పాత్ర ఉంటేనే సినిమా ఒప్పుకుంటుంది. లేదంటే ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా సరే, బలవంతంగా ఒప్పుకోదు.



ఇటీవల బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, సాయి పల్లవి సినిమాలకే పరిమితం కాకుండా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఆశించిన స్థాయిలో కథలో కీలకమైన పాత్రలు రాకపోవడం వల్ల, సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చి కొత్త దారిలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో కొనసాగాలంటే రాజీ పడాల్సి వస్తుందని భావించిన సాయి పల్లవి, తన విలువలు, తన ఆలోచనలకు తగ్గట్లుగా కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.



ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సాయి పల్లవి ఇప్పటికే ఒక డాక్టర్ కావడం తెలిసిందే. మెడికల్ ఫీల్డ్‌లో చదువుకున్న ఆమె, తన విద్యను ఉపయోగించే విధంగా ఒక బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉందట. ఆరోగ్యానికి సంబంధించిన లేదా సోషల్‌గా ఉపయోగపడే ఒక బిజినెస్‌ను స్టార్ట్ చేసి, ఆ రంగంలో స్థిరపడాలని భావిస్తోందని సోషల్ మీడియాలో బలంగా టాక్ వినిపిస్తోంది.మొత్తానికి, డబ్బు కోసం, పేరు కోసం ఎలాంటి పాత్రనైనా చేసే హీరోయిన్ల మధ్య, సాయి పల్లవి మాత్రం తన మనసుకు నచ్చిన పాత్రలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. సినిమాల్లో ఉన్నా లేకపోయినా, తన వ్యక్తిత్వం, తన నిర్ణయాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి, ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా అభిమానుల మద్దతు మాత్రం ఆమెకు ఎప్పటికీ ఉంటుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: