సినిమాలోని ప్రతి పాట కథలో భాగంగా ముందుకు సాగుతూ, పాత్రల భావాలను బలంగా ఎలివేట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ప్రేక్షకులను భావోద్వేగాల లోతుల్లోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా లవ్ సీన్స్‌లో వినిపించిన మ్యూజిక్ థియేటర్లలో యువతను విపరీతంగా కనెక్ట్ చేసింది. అందుకే సినిమా చూసిన చాలామంది “మ్యూజిక్ లేకపోతే లిటిల్ హార్ట్స్ ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.వాణిజ్యపరంగానూ “లిటిల్ హార్ట్స్” అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బిగ్ బ్లాక్‌బస్టర్ హిట్గా నిలిచింది. నిర్మాతలు పెట్టిన ఖర్చుకు ఏకంగా మూడింతలు లాభాలు తీసుకొచ్చి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విజయానికి హీరో, హీరోయిన్ నటనతో పాటు సంగీతం కీలక పాత్ర పోషించిందని ట్రేడ్ వర్గాలు కూడా ఓపెన్‌గా చెబుతున్నాయి.
ఈ సినిమాతో సింజిత్ ఎర్రమల్లి మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. యువ సంగీత దర్శకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కొత్త తరహా మెలోడీస్‌తో పాటు మాస్ ఆడియన్స్‌కు కూడా నచ్చే ట్యూన్స్ ఇవ్వగలగడం ఆయన బలంగా మారింది. “లిటిల్ హార్ట్స్” తర్వాత ఆయనకు వరుసగా అవకాశాలు రావడం కూడా అదే నిరూపిస్తోంది.మొత్తానికి, 2025 ఫ్లాష్‌బ్యాక్‌లో సింజిత్ ఎర్రమల్లి పేరు తప్పకుండా గుర్తుండిపోయేలా చేసింది ‘లిటిల్ హార్ట్స్’ సినిమా. మ్యూజిక్‌తోనే మెంటల్ ఎక్కించిన ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి భవిష్యత్తులో మరెన్నో హిట్ ఆల్బమ్స్ వస్తాయని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి