ఆచార్య సినిమా ఫెయిల్యూర్ తర్వాత కొరటాల శివ మీద నమ్మకం తగ్గిందని చెప్పక తప్పదు. ఆ సినిమా కేవలం బాక్సాఫీస్ దగ్గరే కాదు, క్రిటిక్స్ దగ్గర కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా కథ, స్క్రీన్‌ప్లే, ప్రెజెంటేషన్ అన్నింటిపైనా నెగిటివ్ టాక్ రావడంతో, “కొరటాల శివ మ్యాజిక్ అయిపోయిందా?” అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పటివరకు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్, ఒక్క ఫెయిల్యూర్‌తో ఇంత నెగటివ్ ఫేజ్‌లోకి వెళ్లిపోవడం నిజంగా ఆశ్చర్యమే.ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌తో కమిట్ అయిన ‘దేవర’ 2 సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా అంటే సహజంగానే హైప్ ఉంటుంది. కొరటాల శివకి ఇది ఒక రీ-ఎంట్రీ లాంటి ప్రాజెక్ట్‌గా భావించారు.
ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకురావడానికి మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేశారట. కానీ ఏదో ఒక దశలో ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదన్న టాక్ వినిపించింది. ఈ మధ్య కాలంలో అయితే ‘దేవర పార్ట్ 2 ఆగిపోయింది’ అనే వార్తలు కూడా తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు, ఎన్టీఆర్ - త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడని, ఆ కారణంగానే కొరటాల శివ సినిమా నుంచి తప్పుకున్నాడని కూడా ఘాటుగా కామెంట్స్ వినిపించాయి.సోషల్ మీడియాలో అయితే ఈ విషయాన్ని మరింతగా అతిశయోక్తిగా చూపించారు. “ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం కొరటాల శివ ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్ చేశాడు”, “కొరటాల శివను పక్కన పెట్టేశాడు” అంటూ కామెంట్స్, ట్రోల్స్ వచ్చాయి. ఇవన్నీ కొరటాల శివ ఇమేజ్‌ని మరింత డ్యామేజ్ చేశాయి. అయితే అసలు నిజం ఏమిటి అనే విషయంలో మాత్రం క్లారిటీ లేకపోవడం గమనించాల్సిన విషయం.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, త్రివిక్రమ్ ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ (బన్నీ)తో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడన్న వార్తలు రావడం. దీంతో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ వాయిదా పడినట్టే అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఎన్టీఆర్ మళ్లీ కొరటాల శివతో మింగిల్ అవుతూ ‘దేవర’ ప్రాజెక్ట్‌ని సర్టిఫైగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడట అనే టాక్ వినిపిస్తోంది.అంతేకాదు, ఈసారి కథను మరింత స్పెషల్‌గా మార్చడానికి కొరటాల శివకు ఎన్టీఆర్ కొన్ని సలహాలు కూడా ఇచ్చాడట. కథలో కొన్ని మార్పులు, న్యూ ఎలిమెంట్స్ యాడ్ చేయమని సూచించాడన్న వార్తలు బయటకు వచ్చాయి. ఈ విషయం బయటకు రావడంతో కొరటాల శివ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. “కొరటాల శివ ఏమన్నా ఆటలో వంకాయా? ఎప్పుడు పడితే అప్పుడు ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడానికి, ఎప్పుడు పడితే అప్పుడు ఓకే చెప్పడానికి?” అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం, కొరటాల శివకి కూడా కొన్ని ఎథిక్స్, కొన్ని ప్రొఫెషనల్ విలువలు ఉంటాయి. ఆయనను ఇలా ట్రోల్ చేయడం, తక్కువ చేసి మాట్లాడడం సరైనది కాదని వారు వాదిస్తున్నారు. ఒక డైరెక్టర్ కెరీర్‌ని ఒక్క ఫెయిల్యూర్‌తో జడ్జ్ చేయడం తప్పని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ చాలా సహజమని, వాటిని అతిశయోక్తిగా చూపించడం అనవసరమని అంటున్నారు.
ఈ మొత్తం వివాదంలో మరో పెద్ద ప్రశ్న ఏమిటంటే – త్రివిక్రమ్ అసలు ఎందుకు బన్నీ సినిమా వద్దనుకున్నాడు? తారక్‌తో చేయాలని అనుకున్నాడా? మళ్లీ తారక్‌తో వద్దు, బన్నీతో చేయాలి అని ఎందుకు ఫిక్స్ అయ్యాడు? అనే విషయం ఇప్పటికీ ఒక బిగ్ క్వశ్చన్ మార్క్‌లానే ఉంది. ఇవన్నీ ప్రొఫెషనల్ కారణాలా, డేట్స్ ఇష్యూలా, లేక స్క్రిప్ట్ డిఫరెన్సెస్ వల్లా అనే విషయం బయటకు రాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి