అయితే, శివాజీ గురించి ఇంత పెద్ద రాదాంతం జరుగుతున్నా కూడా, ఈ ఇద్దరు లేడీస్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా రియాక్ట్ కాకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే ఇప్పుడు నెటిజన్లలో అనేక అనుమానాలకు దారి తీస్తోంది.శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించారు. సింగర్ చిన్మయి బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, హీరోయిన్ అనసూయతో పాటు మరికొందరు నటీమణులు కూడా ఈ ఇష్యుపై రియాక్ట్ అయ్యారు. అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఘాటుగా స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
కానీ ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా వెంటనే స్పందించే ఆ ఇద్దరు లేడీస్ మాత్రం ఈ ఇష్యుపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం జనాల్లో కొత్త డౌట్లకు కారణమవుతోంది.“వాళ్లు కావాలనే సైలెంట్‌గా ఉన్నారా?”,“శివాజీ ఇష్యును కావాలనే కొంతమంది హైలైట్ చేస్తున్నారా?”,“ఆయన్ని టార్గెట్ చేసి తొక్కడానికి చూస్తున్నారా?”అనే తరహా కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఈ మొత్తం వివాదానికి కారణం శివాజీ ‘దండోరా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలే. ఆ ఈవెంట్‌లో ఆయన మహిళల డ్రెస్సింగ్ సెన్స్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. పద్ధతిగా చీర కట్టుకుంటే మహాలక్ష్మిలా ఉంటారని, మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటే దరిద్రపు ముండా లాగా కనిపిస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ మహిళలను అవమానించే విధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో మహిళా కమిషన్లు కూడా ఈ విషయంలో సీరియస్‌గా స్పందించాయి. పలువురు సెలబ్రిటీలు, సోషల్ యాక్టివిస్టులు, నెటిజన్లు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఫలితంగా శివాజీ పేరు సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అవుతోంది.
ఇన్ని పరిణామాలు జరుగుతున్నా కూడా, ఎప్పుడూ ఇలాంటి విషయాలపై గట్టిగా మాట్లాడే ఆ ఇద్దరు లేడీస్ మాత్రం సైలెంట్‌గా ఉండటం ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది. ఇది కావాలనే తీసుకున్న నిర్ణయమా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.మొత్తానికి, శివాజీ ఇష్యూ మాత్రం రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతూ సోషల్ మీడియాలో హీట్ పెంచుకుంటూనే ఉంది. ఈ ఇష్యుపై ఇంకా ఎవరు ఎలా స్పందిస్తారో, ఆ ముగ్గురు లేడీస్ ఎప్పుడైనా నోరు విప్పుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి