తమిళ సినిమా పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ స్టార్ హీరోలలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒకరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సహజ నటనకు, డిఫరెంట్ క్యారెక్టర్స్‌కు పెట్టింది పేరు అయిన విజయ్ సేతుపతి తనదైన స్టైల్‌తో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.ఇక తెలుగులోకి అడుగుపెట్టిన విషయానికి వస్తే, టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి తన మొదటి తెలుగు సినిమాను చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం తమిళంతో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.


సాధారణంగా విజయ్ సేతుపతి అంటే చాలా మందికి ఒక సాఫ్ట్ అండ్ సింపుల్ వ్యక్తి, డీసెంట్ లుక్స్‌తో కనిపించే హీరోగా పరిచయం ఉంది. కానీ ఈసారి మాత్రం ఆయన తన ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా పూర్తిగా వింతగా, అస్సలు గుర్తుపట్టలేనంతగా తన లుక్‌ను మార్చుకుని కనిపించాడు.



లేటెస్ట్‌గా విడుదలైన బిగ్ బాస్ తమిళ్ ప్రోమోలో విజయ్ సేతుపతి ఈ కొత్త లుక్‌లో దర్శనమివ్వడంతో తమిళ ప్రేక్షకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. “ఇది నిజంగా విజయ్ సేతుపతేనా?” అనే అనుమానం కూడా చాలా మందికి వచ్చింది.ముఖ్యంగా తమిళ కమెడియన్ రెడిన్ కింగ్స్లే లుక్‌ను పోలి ఉండే విధంగా విజయ్ సేతుపతి తనను తాను మలుచుకోవడం కొందరికి ఫన్నీగా అనిపిస్తే, మరికొందరికి మాత్రం పూర్తిగా షాకింగ్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆయన ఈ లుక్‌పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది.



ఇంతకీ ఈ లుక్ ఏ సినిమా కోసమా? లేక బిగ్ బాస్‌కు సంబంధించిన ప్రత్యేక కాన్సెప్ట్‌లో భాగమా? అనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం రాలేదు. అయితే ఏదేమైనా, విజయ్ సేతుపతి చేసిన ఈ డేర్ అండ్ డిఫరెంట్ లుక్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి…లుక్ ఏదైనా, పాత్ర ఏదైనా, విజయ్ సేతుపతి తన నటనతో మళ్లీ మ్యాజిక్ చేస్తాడనే నమ్మకం మాత్రం ఫ్యాన్స్‌లో ఇంకా అలాగే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: