అని రాసిన ప్లకార్డ్‌ను ప్రదర్శించాడు. ఈ ప్లకార్డ్‌ను చూసిన ప్రభాస్‌తో పాటు వేదికపై ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
యాంకర్ సుమ ఈ విషయాన్ని నిధి అగర్వాల్ దగ్గర ప్రస్తావించగా, నిధి చాలా కూల్‌గా స్పందించారు.“ప్రొఫెషన్ ఆఫ్ లవ్‌లో ఉండాలి” అంటూ ఇచ్చిన సమాధానం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఆమె జవాబు వినగానే ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగింది. ఈ సమాధానం సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయింది.అయితే అసలు చర్చకు దారి తీసింది నిధి స్పీచ్ ముగిసిన తర్వాత జరిగిన విషయం. సుమ సరదాగా మాట్లాడుతూ “చీరలోనే అన్ని నిధులూ ఉన్నట్లున్నాయి” అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్‌కు అక్కడున్న అభిమానులు విజిల్స్, చప్పట్లతో స్పందించారు. ఆ క్షణం ఈవెంట్‌ను నవ్వులతో నింపింది.
కానీ ఇదే వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌కు దారి తీసింది. ఎందుకంటే, ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్ సెన్స్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన మాటలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడారని, క్షమాపణ చెప్పాలని కూడా పలువురు డిమాండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే సుమ చేసిన ఈ వ్యాఖ్యపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. “శివాజీ మాట్లాడితే తప్పా? మహిళ అయిన సుమ మాట్లాడితే సరదా అయిపోతుందా?” అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కొంతమంది నెటిజన్లు సుమ వ్యాఖ్యలను సరదాగా తీసుకోవాలని, అవి ఎటువంటి దురుద్దేశంతో చేసినవి కావని మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం ఇదే మాట పురుషుడు మాట్లాడి ఉంటే పెద్ద వివాదం అయ్యేదని, ఇది స్పష్టమైన డబుల్ స్టాండర్డ్స్ అని విమర్శిస్తున్నారు. ఈ సంఘటన మరోసారి సినిమా ఈవెంట్లలో చేసే వ్యాఖ్యలు ఎంత సున్నితమైనవో గుర్తు చేస్తోంది. సరదాగా అన్న మాట కూడా ఎలా పెద్ద చర్చగా మారుతుందో ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి