సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దశలోనే ఉండగా, సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల నటి త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, అలాగే బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా, సందీప్ రెడ్డి వంగా మార్క్ ఇంటెన్స్ కథనంతో ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్, రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు. ఈ పాత్రను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అత్యంత ఇంటెన్స్‌గా, డెప్త్ ఉన్న క్యారెక్టర్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, స్ట్రాంగ్ ఎమోషన్స్, మానసిక సంఘర్షణలు, పాత్రలోని చీకటి కోణాలను కూడా బలంగా చూపించబోతున్నారట. దీంతో ఈ రోల్ ప్రభాస్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతున్న ఈ చిత్రం 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే అధికారిక విడుదల తేదీని మాత్రం మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.



ఈ క్రమంలోనే ‘స్పిరిట్’ సినిమా నుంచి ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటో చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు. వైరల్ అవుతున్న ఆ చిత్రంలో ప్రభాస్ ఒళ్లంతా రక్తంతో తడిసి, ఒక కారుకు ఆనుకొని కింద కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో కనిపిస్తున్న క్రూరమైన, ఆగ్రహంతో నిండిన లుక్ అందరినీ భయపెడుతోంది.కారు మాత్రమే కాకుండా, కింద భూమి కూడా మొత్తం రక్తసిక్తంగా కనిపించడం ఆ సీన్ ఎంత తీవ్రంగా ఉండబోతుందో అర్థం చేసుకునేలా చేస్తోంది. ఈ లుక్ చూస్తేనే సినిమాలో యాక్షన్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతూ, అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.



ఈ లుక్ చూసిన నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు..“ఈసారి రణరంగమే”,“ఇది ప్రభాస్ రేంజ్”,“సందీప్ వంగా + ప్రభాస్ అంటే ఊచకోతే” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ‘స్పిరిట్’ సినిమాతో ప్రభాస్ మరోసారి తన నటనా శక్తిని కొత్త స్థాయికి తీసుకెళ్లబోతున్నాడనే చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు అభిమానుల్లో ఈ హైప్ అలాగే కొనసాగడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: