తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా రామకృష్ణ  వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'దర్పణం'.. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌ కి విశేష స్పందన లభించగా.. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  సెప్టెంబర్‌6న  గ్రాండ్ గా విడుదలకానుంది.
ఈ సందర్భంగా ..... 


చిత్ర దర్శకుడు రామకృష్ణ వెంప మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చిన అన్ని సినిమాలు విజయం సాధించాయి. అదే తరహాలో క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం దర్పణం. లాస్ట్‌ మినిట్‌ వరకు ఏం జరుగుతుందా? అని సస్పెన్స్‌ని క్రియేట్‌ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది.. ప్రొడ్యూసర్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా సినిమాని నిర్మించారు ఆయన సహకారం మర్చిపోలేనిది. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది'' అన్నారు. 


నిర్మాత క్రాంతి కిరణ్‌ వెల్లంకి మాట్లాడుతూ.... చాలా కష్టపడి ఇష్టపడి సినిమా చేశాము.. దర్శకుడు రామకృష్ణ మేకింగ్‌ ఈ చిత్రానికి మంచి అసెట్‌ అవుతుంది. అందరు సపోర్ట్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను. రీసెంట్‌గా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది..సెప్టెంబర్‌6 న విడుదలచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్‌ సినిమాలకు మించి ఈ సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తోంది. సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం'' అన్నారు. ఇంత‌కు ముందు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ చాలానే వ‌చ్చాయి. మ‌రి ఈ స‌స్పెన్స్ ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకుంటుంది. ఆఖ‌రివ‌ర‌కు వెంటాడే స‌స్పెన్స్ ఏంటి అన్న‌ది తెలియాలంటే త‌ప్ప‌కుండా సినిమా చూడాల్సిందే. ఇదిలా ఉంటే క‌థ‌లో కొత్త‌ద‌నం కాని ద‌ర్శ‌కుడు క‌థ‌ను చూపించ‌డంలో కొత్త‌ద‌నం క‌నిపించినా చాలు ప్రేక్ష‌కుడు ఆ చిత్రాన్ని ఆద‌రిస్తారు. అది చిన్న చిత్ర‌మా లేక పెద్ద చిత్ర‌మా అన్న‌ది ప‌క్క‌న పెడితే దాన్ని ఆద‌రించ‌డానికి త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ముందుకు వ‌స్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: