నాని తాజా సినిమా పేరు గ్యాంగ్ లీడర్. ఈ సినిమా పేరు గ్యాంగ్ లీడర్ అని దర్శకుడు విక్రమ్ చెప్పిన వెంటనే నాని ముందుగా ఎగిరి గంతు వేశాడట. ఈ సినిమా పేరే ఇంత త్రిల్లింగ్ గా ఉంటే ఇక కథ ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుందని ఉత్సాహ పడ్డాడట. గ్యాంగ్ లీడర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నాని ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాడు.

గత సంవత్సరంలో ఇదే సమయానికి బిగ్ బాస్ 2కి హోస్ట్ గా పనిచేశాడు నాని. అప్పట్లో నాని కి కౌశల్ కు మధ్య జరిగిన వివాదాల్లో చిక్కుకుని ప్రెస్ మీట్ కి వెళ్ళిన కౌశల్ గురించి వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఎన్నోసార్లు ప్రెస్మీట్లో విలేకరుల మీద విరుచుకుపడ్డాడు నాని. ఇక తన జీవితంలో ఎప్పుడూ మళ్లీ బిగ్ బాస్ హోస్ట్ గా పనిచేయడం అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పట్లో కానీ ఈసారి బిగ్బాస్ జరుగుతుండగా బిగ్బాస్ ప్రశ్నలను తప్పించుకునే అవకాశం లేని విధంగా ఉండటంతో విలేకరుల నుంచి మళ్ళీ ప్రశ్నలను ఎదుర్కొన్నాడు.

అయితే వాటన్నిటినీ పక్కనపెట్టి గ్యాంగ్లీడర్ సినిమా ప్రమోషన్లలో ఎటువంటి ప్రశ్నలు వేసిన ఎంతో ఉత్సాహంగా సమాధానం చెప్పాడు. ఈ సినిమా ఎంతో గొప్ప విజయం సాధిస్తుంది అని ఇంత వినూత్నమైన స్టోరీకి నేను హీరోగా పని చేయడం నాకు ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు.

ముందు గ్యాంగ్ లీడర్ అన్న పేరు విన్నప్పుడు ఇదేదో పెద్ద యాక్షన్ సినిమా అని అనుకున్నాను అని కానీ ఆ తర్వాత దాని అర్థం తెలిసిన తరువాత ఆనందం ఇంకా రెట్టింపు అయిందని అన్నాడు. ఈ సినిమా పోస్టర్లలో ను టీజర్ లో ను చూస్తే కనుక ఎంతో మంది ఆడవాళ్లకు అండగా నిలిచిన ఒక లీడర్ గా నాని గ్యాంగ్ లీడర్ అనిపించుకుంటాడు. వారు పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్న తరుణంలో వాళ్ళకి సహాయం చేసే గ్యాంగ్లీడర్ అవుతాడు నాని.


మరింత సమాచారం తెలుసుకోండి: