సినీ నటి అమల ఎక్కువగా మాట్లాడరు. ఆమె సినిమా రంగం నుంచి విరమించుకున్నాక జంతు సంరక్షణ  కోసం పూర్తి సమయం కేటాయిస్తూ తనకు ఇష్ట‌మైన వ్యాపకంగా మార్చుకున్నారు. నాగార్జునను ఆమె వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు ఆమె దూరమైన సంగతి తెలిసిందే అమల అంటే అక్కినేని వారి కోడలు అంటారు. ఆమె తల్లిదండ్రులు ఎవరు.. వారి వివరాలు ఏంటి.. ఇది చాలా ఆసక్తికరమే.


దాని గురించి అమల ఓ ఎమోషనల్ పోస్టింగ్ పెట్టారు. తన తల్లిదండ్రుల గురించి సోషల్ మీడియాలో అసత్యప్రచారం  జరుగుతోందని బాధపడుతూ తాను నిజాలు చెబుతున్నానని అమల అంటున్నారు. అమల తండ్రి కమాండర్ ఎంకె ముఖర్జీ. ఆయన ఈస్ట్ బెంగాల్ అంటే ఇపుడున్న బంగ్లాదేశ్ లోని  ఢాకాలో దేశ విభజనకు పూర్వం పుట్టారట. ఆ తరువాత ఆయన ఉత్తరప్రదేశ్ లో పెరిగారు. ఆయన భారతీయ నావికాదళంలో కమాండర్ గా పనిచేశారని అమల చెప్పుకొచ్చారు.


ఇక తన తల్లి ఐరిష్ మహిళ అని ఆమె భారతీయత‌ను ఎక్కువగా నమ్మే మహిళ అని కూడా చెప్పారు. తన తల్లిని నాగార్జున అత్తగారు అంటూ భారతీయతలు ప్రతిరూపమైన మహిళగా పిలిచి అభినందించేవారని అమల చెప్పింది. ఇక తన తల్లితండ్రుల విషయంలో వస్తున్న అసత్య కధనాలకు స్పందించి ఈ  పోస్ట్ చేస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోనైనా తప్పుడు ప్రచారం చాలా తప్పు అంటూ అమల చేసిన ఈ పోస్టింగ్ ఇపుడు వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ రూపంగానైనా అమల తల్లితండ్రుల వివరాలు అందరికీ తెలిశాయి. వారు ఎంత గొప్పవారు అన్న సంగతి కూడా ప్రపంచానికి తెలిసింది.  అయితే సెలిబ్రిటీల విషయలో ఏమీ తెలియకుండా తప్పులను ప్రచారం చేయడం చాలా తప్పు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: