ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ లో జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరం వి పొట్లూరి నిర్మాణంలో వస్తున్న సినిమాలకు మేజేనర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఆ నిర్మాణ సంస్థను మోసం చేసి దాదాపుగా 10 కోట్ల దాకా కుచ్చు టోపి పెట్టినట్టు తెలుస్తుంది.  పివిపి బ్యానర్ లో వచ్చే అన్ని సినిమాలకు అతనే ప్రొడక్షన్ మేనేజర్ గా ఉన్నాడు.


అయితే ప్రొడక్షన్ కాస్ట్ కన్నా ఎక్కువ నష్టం కనబడుతుండటం వల్ల మేనేజర్ పనితనాన్ని అబ్సర్వేషన్ లో పెట్టగా అసలు దొంగ అతనే అని తేలింది. నిర్మాతలు నమ్మి పెట్టిన మేనేజర్లే ఈ విధంగా మోసం చేస్తే ఎలా అంటున్నారు పరిశ్రమ వర్గాలు. పివిపి దగ్గర సినిమాలకు మేనేజర్ గా ఉంటూ దాదాపు 10 కోట్ల దాకా టోకరా పెట్టాడట ఆ మేనేజర్.


పివిపి మేనేజ్మెంట్ కు డౌట్ వచ్చి ఆర్ధిక వ్యవహారలు లెక్క చూడటంతో అసలు విషయం బయట పడ్డదట. మేనేజర్ భారీగా నొక్కేసినట్ట్టు వెళ్లడైంది. అయితే ఇప్పుడు ఆ మేనేజర్ మీద పోలీస్ కేసు నమోదు చేశారు పివిపి నిర్మాత పరం వి పొట్లూరి. అయితే ఇక్కడ మరో షాక్ ఏంటంటే నిందితుడు తన తప్పుని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. 


అతను దోచుకున్న డబ్బు రికవెరీ చేసే ప్రాసెస్ నడుస్తుందని టాక్. ఇక ఈ కేసులో ఊహించని మరో ట్విస్ట్ ఏంటంటే మేనేజర్ భార్య తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం వల్ల కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే మేనేజర్ తన తప్పుని ఒప్పుకోవడం వల్ల డిస్కషన్స్ ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నారు. అయితే పివిపి మాత్రం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడని తెలుస్తుంది.     


 



మరింత సమాచారం తెలుసుకోండి: