తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా సురేందర్ రెడ్ది దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "సైరా" నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్ చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ విడుదలయిన సందర్భంగా ఈ చిత్రం గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.


ట్రైలర్ లో చిరంజీవి చెప్పే డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. నరసింహారెడ్డి వీరుడి కథ ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే సినిమా తీశామని దర్శకనిర్మాతలు చెప్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2 వ తేదీన విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో జోరు పెంచారు. ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు /వెల్లడించాడు.


సైరా క్లైమాక్స్ లో చిరంజీవి మరణిస్తారా? అలా అయితే ప్రేక్షకులు తీసుకుంటారని మీరు భావిస్తున్నారా అని అడగగా సురేందర్ రెడ్డి చాలా చక్కగా సమాధానం ఇచ్చాడు.ఒక బయోపిక్ తీస్తున్నప్పుడు చరిత్రని మార్చితీయలేం. సైరా లో చిరంజీవి పాత్ర చనిపోవడం విషాదం కాదు, అది విజయానికి నిదర్శనం. ఆయన మరణిస్తూ అనేక మంది భారతీయులలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించి పోయారు. అటువంటి వీరుడు మరణిస్తే అది హిస్టరీ అవుతుంది కానీ ట్రాజెడీ కాదని అన్నారు.


నరసింహారెడ్డి తలని ముప్పై ఏళ్లకు పైగా బ్రిటిష్ వారి కోట గుమ్మానికి వేలాడదీసి ఉంచారంటేనే, ఆయన వారిని ఎంతగా భయపెట్టారో అర్థం అవుతుంది. కాబట్టి సైరాలో క్లైమాక్స్ విషాదాంతం అనడానికి వీలులేదు అన్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటిస్తుండ,అమితాబ్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: