నానీస్ గ్యాంగ్ లీడర్ ప్రస్తుత పరిస్థితేంటి అంటే ప్రశ్నార్థకమే అని తెలుస్తోంది.? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండో వారంలో ఎలా రాబడుతోంది? ప్రస్తుతం అందిన సమాచారం మేరకు పరిశీలిస్తే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి. సెప్టెంబర్ 13 న విడుదలైన గ్యాంగ్ లీడర్ మొదటివారం వారానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.18.96 కోట్ల  గ్రాస్ రాబట్టింది. 4వ రోజు నుంచి వసూళ్లలో ఊహించని విధంగా డ్రాప్ కనిపించి నాని తో పాటు ఇండస్ట్రీలో అందరిని ఆశ్చర్యపరిచింది. నాలుగో రోజు తర్వాత మూడు రోజుల్లో గ్యాంగ్ లీడర్ వసూళ్లు కేవలం 2.42 కోట్లు మాత్రమేనని లెక్కలు చెబుతున్నాయి. సరైన ప్రమోషన్ లేకపోవడం నాని అండ్ గ్యాంగ్ పట్టించుకోకపోవడం వంటి ఇతర కారణాలతో వసూళ్లలో సడెన్ డ్రాప్ కనిపించింది.

ఏరియా వైజ్ గా తొలి వారం గ్రాస్ వివరాలు పరిశీలిస్తే.. నైజాం- 5.80 కోట్లు.. సీడెడ్- 1.81 కోట్లు.. కృష్ణా- 1.10 కోట్లు.. గుంటూరు -1.21 కోట్లు.. నెల్లూరు -0.47 కోట్లు.. వెస్ట్ గోదావరి- 0.85 కోట్లు.. ఈస్ట్ గోదావరి- 1.20 కోట్లు.. ఉత్తరాంధ్ర -1.90 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.50 కోట్లు.. ఓవెర్సీస్ -3.12 కోట్లు.. మొత్తంగా చూస్తే 18.96 కోట్లు రాబట్టింది గ్యాంగ్ లీడర్.
ఓవైపు ఈ శుక్రవారం నుంచి రెండు సినిమాలు నానీస్ గ్యాంగ్ లీడర్ తో పోటీపడుతున్నాయి. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి).. సూర్య నటించిన బందోబస్త్ సినిమాలు కలెక్షన్స్ ను షేర్ చేసుకుంటున్నాయి. వరుణ్ నటించిన వాల్మీకి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో జనాల దృష్టి ఆ థియేటర్ల వైపు మళ్లీంది. దాంతో ఇక నానీస్ గ్యాంగ్ లీడర్ పరిస్థితేమిటి? అన్నది పెద్ద క్వశన్ గా మారింది. 

గ్యాంగ్ లీడర్ ఇప్పటివరకూ సాధించింది చాలా తక్కువ కలెక్షన్లే. కనీసం లాంగ్ రన్ లో అయినా పంపిణీదారులు సేవ్ అవుతారా? అన్నది అసలు ఏమాత్రం కూడా చెప్పలేని పరిస్థితి. దాదాపు 28 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ మొత్తంలో షేర్ రాబట్టాల్సి ఉంటుంది. కానీ గ్రాస్ మ్యాటరే 19కోట్ల ఆగిపోయింది. దీనిని బట్టి బ్రేక్ ఈవెన్ కి షేర్ రూపంలోనే ఇంకా సుమారు మరో 10కోట్లు పైగానే వసూలు చేయాల్సి ఉంటుందని క్లియర్ గా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే నాని ని వరుణ్ గట్టిగానే తొక్కేస్తున్నట్లు కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: