వెండితెర అవకాశాలతో దూసుకుపోతు ఎవరైనా తమ హవాను కొనసాగిస్తారు. అలా కాకుండా బుల్లితెరపై కాలుమోపి సక్సెస్ అయిన తర్వాత  వెండితెరపై వచ్చే అవకాశాలకు అందుకొని సినిమాలలో నటిస్తారు. అలా చాలా మంది యాంకర్లు వెండితెరపై తమ హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇకపోతే రాశిమీ గౌతమి విషయంలో మాత్రం అది కాస్త రివర్స్ అయింది. ఈ బ్యూటీ వెండితెర నుండి బుల్లి తెరపై కి ఎంట్రీ ఇచ్చింది. 


ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా చేస్తూనే వచ్చిన సినిమా అవకాశాలను కూడా వదలకుండా చేస్తూ వస్తుంది. ఆ మధ్య గుంటూరు టాకీస్ సినిమాతో తన హాట్ అందాలను మరింత ఎక్కువగా చూపించి అందరి చేత గుంటూరు మిర్చి ఘాటు ఎక్కువైందనే ట్రోల్స్ వేయించుకుంది. అలా మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఎటు చుసిన కూడా హాట్ అందాలతో ఫ్యాన్స్ కి కిక్కేస్తుందనే చెప్పాలి. 


వివరాల్లోకి వెళితే.. యాంకరింగ్ తో పాటుగా ఎన్నో ఈవెంట్స్ కూడా చేస్తూ వస్తుంది. షాప్ ఓపెంగ్స్ కూడా చేస్తూ వస్తుంది. జబర్దస్త్ కమెడియన్లు కూడా బాగానే సంపాదిస్తున్నారు. ఆ షో లో చాలా మంది నాలుగు రాళ్లు వెనకేసుకొస్తున్నారు. అయితే, తాము పుట్టిన ఊరికి ఏదోకటి చేయాలనే ఆలోచనతో ఏదోకటి చేస్తూ వస్తారు. ప్రస్తుతం జబర్దస్త్ ఆర్పీ కూడా తానూ పుట్టిన నెల్లూరు కోసం ఒక ఈవెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 


ఆ కార్యాలయానికి సంబందించిన విషయాలను చెప్పడానికి మొన్న ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకుల మధ్య వివరించారు. అన్ని శుభకార్యాలకు ఈ ఈవెంట్ హాల్ చాలా బాగా ఉపయోగ పడుతుందని ఆర్పీ మీడియా ముఖంగా చెప్పారు. నిన్న ఆ ఈవెంట్ ఆఫీస్ ను జబర్దస్త్ యాంకర్ రష్మీ చేత ఓపెన్ చేయించారు. ఆ ఈవెంట్ ఓపెనింగ్ కి చాలా మంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: