విజయ్ దేవరకొండ ప్రస్తుతం యువత అంతా పిచ్చెక్కేలా ఫాలో అవుతున్న పేరు ఇది. ఎప్పుడైతే అర్జున్ రెడ్డి వచ్చిందో అప్పటి నుండి విజయ్ ఓ స్టార్ హీరోగా వారు ఫాలో అవుతున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన గీతా గోవిందం కలక్షన్స్ అతన్ని నిజంగానే స్టార్ అనేలా చేశాయి. కేవలం 3 సినిమాలకే ఈ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ రీసెంట్ గా గీతా గోవిందం సక్సెస్ మీట్ లో దిల్ రాజు చెప్పినట్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత యూత్ ఇంతలా కనెక్ట్ అయ్యింది ఈ హీరోతోనే అని చెప్పొచ్చు.


ఎవడే సుబ్రమణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం కేవలం మూడంటే మూడు సినిమాలతో ఈ రేంజ్ కు ఎదిగాడు. ఇక గీతా కలక్షన్స్ ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ దాటడం ముఖ్యంగా ఇద్దరు స్టార్స్ కు షాక్ అయ్యేలా చేసింది.


విజయ్ క్రేజ్ చూసి స్టార్స్ అంతా షాక్ అవుతున్నారు. పవన్, మహేష్, ఎన్.టి.ఆర్, ప్రభాస్, చరణ్ ఈ స్టార్ రికార్డులను టచ్ చేసే స్టామినా విజయ్ కు కాస్త టైం పడుతుంది. కాని ఇప్పటికే అల్లు అర్జున్, నానిలను క్రాస్ చేసి వారు కూడా అందుకోలేని రికార్డ్ సాధించాడు విజయ్ దేవరకొండ.


గీతా గోవిందం ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. ఇప్పటివరకు అల్లు అర్జున్, నాని సినిమాలేవి 2 మిలియన్ మార్క్ అందుకోలేదు. అంతేకాదు వరుసగా 3 సినిమాలు మిలియన్ మార్క్ అందుకుని తెలుగు హీరోల్లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాడు విజయ్ దేవరకొండ.



మరింత సమాచారం తెలుసుకోండి: