సంక్రాంతి పండుగ తెలుగువారికి పెద్ద పండుగ. కొత్త అల్లుళ్ళతో సంబరాలు చేసుకోవడం, ఆనందాలతో అంతటా హ్యాపీ మూడ్ ని తీసుకువచ్చే పండుగ ఇది. ఇక తెలుగు వారి సంక్రాంతికి మరో విశేషం కూడా ఉంది. ఆ రోజున పందెం కోళ్ళ మాదిరిగా స్టార్ హీరోల మూవీస్ విడుదల చేస్తారు. ఈసారి చూసుకుంటే చాలా మంది అల్లుళ్ళు సంక్రాంతికి సందడి చేసేలాగ కనిపిస్తున్నారు. ఆ పోటీ చూసి చూడాల్సిందే.
ఇక సీనియర్ యాక్టర్ వెంకటేష్ చాలా కాలానికి ముఖానికి రంగు వేసుకుని నటిస్తున్న ఓ సినిమా సంక్రాంతికి రానుందని టాక్. సూపర్ హిట్
చిత్రాల నిర్మాత దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఎఫ్ 2 సినిమా సంక్రాంతి రేసులోకి దూసుకువస్తోంది. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు కూడా. ఇప్పటికి ఎనభై శాతం పైగా సినిమా పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో వెంకటేష్, యువ నటుడు వరుణ్ తేజ్ తోడల్లులుగా నటిస్తున్నారు. వెంకీ సరసన అందలా తార తమన్నా జంట కాగా వరుణ పక్కన జోడీగా మెహ్రిన్ కౌర్ నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ డ్రామాగ వస్తున్న ఈ మూవీ సంక్రాంతికి హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.
ఇక ఇదే సంక్రాంతి జనవరి 9న అన్న నందమూరి బయోపిక్ ఎన్టీఆర్’. కూడా వస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ బాలయ్య కాంబో సూపర్ హిట్ అని ప్రూవ్ అయిన నేపధ్యంలో కధానాయకుడు ఎన్టీఆర్’. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. ఈ మూవీ మీద అంచనాలు కూడా బాగా పెంచేస్తున్నారు.
ఇక మరో క్రేజీ మూవీ కూడా సంక్రాంతి పందెం కోడి అంటున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న వినయ విధేయ రామ సినిమాపైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో రాముడు మంచి బాలుడు టైప్ కారెక్టర్ లో చెర్రీ కనిపించబోతున్నాడు. మొత్తానికి రేపటి సంక్రాంతికి ఈ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. మరెన్ని సినిమాలు వస్తాయో ఇంకా చూడాలి.