హైదరాబాద్ నుండి ప్రచురితమయ్యే ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక వినాయక చవితి రోజున విడుదల కాబోతున్న ‘రభస’ సినిమాను చుట్టబెట్ట బోతున్న సమస్యల వలయాన్ని ఊహిస్తూ ఒక ఆశక్తికర కధనాన్ని ఈరోజు ప్రచురించింది. జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా బాలకృష్ణకు క్షమార్పణ చెప్పకుంటే బాలకృష్ణ అభిమానులు అందరూ ‘రభస’ సినిమాకు సహాయ నిరాకరణ చేయడమే కాకుండా జూనియర్ పై తమ యుద్దాన్ని కొనసాగిస్తాము అని నందమూరి అభిమాన సంఘానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి ఆ దిన పత్రికతో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు అనే సంచలన గాసిప్ కధనాన్ని ప్రచురించింది.  గతంలో ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా విషయంలో బాలకృష్ణ అభిమానులు చేసిన నెగిటివ్ టాక్ పబ్లిసిటీ వల్ల రామయ్య సినిమా ఊహించిన స్థాయికి మించి ఫ్లాప్ టాక్ ను తెచ్చు కుంది అనే విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు కూడ ‘రభస’ సినిమా విషయంలో అదే సీన్ రిపీట్ కాబోతోందా? అనే అర్ధాలు ఇచ్చేట్లుగా ఆ ఆంగ్ల పత్రిక కధనం ఉంది.  జూనియర్ కెరియర్ కు పరీక్షగా మారిన ‘రభస’ సినిమా విడుదల  ముందు ఈ గాసిప్ వార్త ఎందుకు ప్రచురితమైంది అనే విషయానికి సమాధానాలు దొరకడం కష్టం. అదేవిధంగా బాలకృష్ణ ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమాను జూనియర్ పూరీల కొత్త సినిమా విడుదల తేదీ నాటికి అటు ఇటుగా విడుదల చేసి బాలయ్య జూనియర్ పై తన యుద్దాన్ని కొనసాగిస్తాడు అనే కధనం కూడ రాసింది ఈ పత్రిక. ఏమైనా జూనియర్ కు ఈ జాతీయ మీడియా పత్రిక రాసిన కధనం గట్టి షాకింగ్ న్యూస్ అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: