అమెరికాలో హెచ్ 1 బీ వీసా జారీ విషయంలో మరో కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఇప్పటికే ట్రంప్ తమ స్వదేశీయులకి మేలు చేకూర్చే విధంగా హెచ్ 1 బీ వీసా జారీ విషంలో ఎన్నో నిభందనలు అమలు చేసిన విషయం విధితమే. కాగా తాజగా మరో సారి ట్రంప్ ప్రభుత్వం మరొక నిభందనని జత చేసింది. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటన చేశారు.

 

గతంలో కంపెనీలలో పనిచేసే విదేశీ ఉద్యోగుల విద్యార్హత , తమ కంపెనీలలో పనిచేస్తున్నట్టుగా రుజువులు చూపిస్తే పని చేయనిచ్చే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తాజాగా జారీ అయిన నిభందన ప్రకారం  సదరు కంపెనీ విదేశీ ఉద్యోగిని ఎందుకు తమ కంపెనీలోకి తీసుకుంటోంది. ఆ ఉద్యోగానికి ఎందుకు విదేశీయుడినే ఎందుకు ఎంచుకున్నారు అనే వివరాలు తెలుపాల్సి ఉంది.

 

ఇలా సదరు కంపెనీ వివరాలు సమర్పించిన తరువాత మాత్రమే అన్ని పరిశీలించి,  హెచ్ 1 బీ వీసా జారీ చేస్తారని తాజాగా విడుదలైన మార్గదర్శకాలు తెలుపుతున్నాయి. అయితే ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో సైతం భారతీయులు అత్యధికంగా వీసాలని పొందగలుగుతున్నారని ఓ నివేదిక తెలిపింది. 2018 లో మంజూరైన వీసాలు 62.4 శాతం కాగా , 2019 లో ఇది 65 . 4 శాతానికి పెరిగింది. మరి ఈ తాజా నిభందన ఎలాంటి పరిణామాలని కలిగిస్తోందో వేచి చూడాలి అంటున్నారు నిపుణులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: