కాశ్మీర్ సమస్య.. ఇది భారత్ కు సంబంధించినదైనా... పాక్ లోనూ ఇదో హాట్ టాపిక్. కాశ్మీరీలకు అండగా నిలవడం అన్నది అక్కడి ప్రజల్లో భావోద్వేగాలను రేపే అంశం. అందుకే అక్కడి ప్రభుత్వాలు భారత్ ను తిడుతూ.. అక్కడి ప్రజల్లో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. అందుకే అక్కడ కాశ్మీర్ సమస్య ఆ దేశ సమస్యగా భావిస్తారు.


అయితే తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పాకిస్తానీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కశ్మీర్ అంశం కానే కాదని ఆ సర్వేలో తేల్చిచెప్పింది. గాలప్-గిలానీ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఇంతకీ పాక్ ను వేధిస్తున్న అతి పెద్ద సమస్యలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగమేనట.


పాక్ లో 53శాతం మంది ప్రజలు.. ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నారట. 23శాతం మంది ప్రజలు నిరుద్యోగాన్ని పెద్ద సమస్యగా ఫీలవుతున్నారట. మరో 4శాతం మంది ప్రజలు అవినీతిని, మరో 4శాతం మంది ప్రజలు నీటి సంక్షోభాన్ని ముఖ్యమైన సమస్యలుగా భావిస్తున్నారు.


మరి కాశ్మీర్ సమస్య సంగతేంటంటారా.. కేవలం 8 శాతం మంది ప్రజలు దీన్నో ఇష్యూగా చూస్తున్నారట. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా లేవనెత్తాలని తీవ్రంగా శ్రమిస్తున్న పాక్ ప్రభుత్వానికి 8 శాతం ప్రజల నుంచి మాత్రమే మద్దతు దొరుకుతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: