ఆడవాళ్లు అంటే వంటింటికి మాత్రమే పరిమితం అనే మాట వినిపించేది. కానీ నేటి రోజుల్లో మాత్రం పురుషులకు తాము ఎక్కడ తక్కువ కాదు అని మహిళలు నిరూపిస్తున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇక చదువుల్లో పురుషులతో సమానంగా  పోటీ పడుతున్న మహిళలు  ఉద్యోగాలు సాధించడంలో కూడా అదేరీతిలో పోటీపడుతున్నారు.. అంతే కాదు కుటుంబ బాధ్యతలు పంచుకోవడంలో కూడా ప్రస్తుతం ఎంతో మంది మహిళా మణులు ముందుంటున్నారు అని చెప్పాలి. మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగం లో చేరి కుటుంబ బాధ్యతలు పంచుకుంటే ఓకే కానీ ఇక్కడ ఓ మహిళ మాత్రం కష్టపడుతున్న తీరు అందరి మనసును కదిలిస్తుంది. ఇక బతుకు బండిని ముందుకు నడిపేందుకు ఆ మహిళ కష్టం చూసి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.



 భర్త దూరమైనప్పటికీ బ్రతుకు భారంగా మార్చుకోకుండా ఎంతో కష్టపడి పోతుంది ఆ మహిళ. ఏకంగా ఒకేసారి నాలుగు సిలిండర్లను మోస్తున్న చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే మలేషియాకు చెందిన ఖైరున్నిసా అనే 30 ఏళ్ల మహిళ గ్యాస్ సిలిండర్ సప్లయర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక ఈ పని చేయడానికి పురుషులు మాత్రమే వస్తూ ఉంటారు. కానీ మహిళలు కనిపించడం చాలా అరుదు. కానీ భర్త దూరమవడంతో ఇక కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఆమె భుజాన వేసుకున్న సదరు మహిళ  ఈ వృత్తిలో చేరి ఏకంగా 4-సిలిండర్లని  ఒకేసారి మోస్తూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది సదరు మహిళ.


 ఇక మొదట ఈ మహిళ ఇలాంటి పనిలో చేరినప్పుడు అందరూ ఎగతాళి చేశారు. కానీ ఎవరినీ లెక్క చేయకుండా పని చేయడం మొదలు పెట్టిన  మహిళ ఇక ఒక్కరోజులోనే 60 నుంచి 100 గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తూ ఉంటుంది. కేవలం నాలుగు సిలిండర్లు మాత్రమే కాదు ఏకంగా ఒకేసారి ఏడు గ్యాస్ సిలిండర్ల వరకు కూడా ఈ మహిళ మొస్తుందట. ఇలా కుటుంబ బాధ్యతల కోసం కష్టపడుతున్న మహిళను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఆమె పట్టుదల కు కష్టపడుతున్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gas