
ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త కాస్త వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వార్త దేని గురించో తెలుసా.. అందరూ ఇష్టపడే రుచికరమైన ఫైన్ ఆపిల్ గురించి. పైనాపిల్ గురించి పెద్దగా వార్త ఏమంటుంది.. సాధారణంగా ఆ పండు ఆరోగ్యానికి మంచిది.. తినాలని డాక్టర్లు కూడా సూచిస్తూ ఉంటారు ఇలాంటిదే కదా అని అనుకుంటారు అందరూ. కానీ ఇక్కడ వైరల్ గా మారిన వార్త మాత్రం పైనాపిల్ ధరకు సంబంధించింది. సాధారణంగా పైనాపిల్ ఎంత ధర ఉంటుందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.. మహా అయితే వందల్లో ఉంటుంది. కానీ ఏకంగా ఒక్క పైనాపిల్ లక్ష రూపాయలు ధర పలుకుతుంది అంటే నమ్ముతారా.
ఊరుకోండి బాసు పైనాపిల్ ఏంటి.. లక్ష రూపాయలు ధర పలకడమేంటి అని ఇదంతా జోక్ అనుకొని కాసేపు నవ్వుకుంటారు. అలా అనుకున్నారు అంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఇటీవల బ్రిటన్ లో ఏకంగా ఒక్క పైనాపిల్ కి లక్ష రూపాయలు ధర పలుకుతుంది. అయినప్పటికీ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు అక్కడి జనాలు. అత్యంత అరుదుగా లభించే హెలికాన్ అనే పైనాపిల్ కు ఇలా భారీ డిమాండ్ ఏర్పడింది అని చెప్పాలి. అయితే ఈ పంట చేతికి వచ్చేసరికి మూడేళ్లు పడుతుందట. ఇక ఇలా మూడేళ్ల పాటు అధిక ఖర్చులు ఉంటాయట. ఇక పెట్టుబడి పోను లాభాలు రావాలంటే లక్ష రూపాయలకు ఒక ఫైన్ ఆపిల్ను అమ్మాల్సిందేనట. అయితే ఈ పైనాపిల్ బహిరంగ వేలంలో అయితే పది లక్షల వరకు కూడా పలుకుతున్నట్లు తెలుస్తోంది.