
గతంలోనే నాటో దేశాలు, అమెరికా పెట్రోల్ డీజీల్ కొనకూడదని ఒప్పందం చేసుకున్నాయి. అయితే దీని వల్ల రష్యా తీవ్రంగా నష్ట పోయి తమ దారికి వస్తుందని అమెరికా భావించింది. కానీ అది సరికాదని తేలిపోయింది. రష్యా రోజు రోజుకు తన ఆయుధాలను పెంచుకుంటూ పోతుంది. ముడి సరకును చైనా నుంచి కొనుక్కొని ఆయుధాలను తయారు చేసుకుంటూ మరీ యుద్ధంలో పాల్గొంటుంది. 30 దేశాలు ఒక వైపు.. రష్యా ఒక వైపు నిలబడి పోరాటం చేయగలుగుతుంది.
అయితే రష్యా ను మరో విధంగా దెబ్బ కొట్టాలని అమెరికా, నాటో దేశాలు ప్లాన్ వేశాయి. రష్యా లో డైమండ్ (వజ్రాల) బిజినెస్ ఎక్కువ. ఈ డైమండ్స్ కు యూరప్ దేశాల్లో ఎక్కువగా బిజినెస్ ఉంటుంది. అయితే రష్యా నేరుగా వజ్రాల వ్యాపారం చేయదు. అది ఇండియాకు వజ్రాలకు సంబంధించిన ముడి సరకును పంపిస్తుంది. గుజరాత్ లో వీటి తయారీని చేపట్టి ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భద్రత చర్యలు తీసుకుని వీటి తయారీ, రవాణా కొనసాగుతుంది. దాదాపు 90 శాతం బిజినెస్ ఇండియాలోని గుజరాత్ లోనే సాగుతుంది. అయితే వజ్రాల వ్యాపారాాన్ని ఎలాగైన దెబ్బకొట్టాలని అమెరికా, నాటో దేశాలు భావిస్తున్నాయి. ఈ రెండు దేశాలు భారత్ కు తన బృందాన్ని పంపించి రష్యా నుంచి వచ్చే వజ్రాల తయారీ ముడి సరకును తీసుకోవద్దని కోరనుంది. మరి దీనికి భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.