ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్తే వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఏకంగా జనావాసాల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ సిబ్బంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి ఘటనలు ఎన్నోసార్లు చూశాము. అయితే అడవుల్లో కార్చిచ్చు అంటుకుంది అంటే చాలు ఎన్ని ఫైర్ ఇంజన్లు తెచ్చినా మంటలను ఆర్పడం అసాధ్యమని చెప్పాలి. కానీ సిబ్బంది మాత్రం ఇలా మంటలను అర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలా అడవుల్లో మంటలను అడ్డుకునేందుకు ఏకంగా మేకలను ఉపయోగించడం గురించి ఎప్పుడైనా విన్నారా. మేకలను ఉపయోగించి మంటలను అడ్డుకోవడమేంటి.. మంటల్లో ఆ మేకలు కూడా ఆహుతి అయిపోతాయి కదా అంటారు ఎవరైనా.
కానీ ఇక్కడ మాత్రం ఇదే జరిగింది. ఏకంగా అడవుల్లో మంటలు రాకుండా మేకలతో అడ్డుకోవడం సాధ్యమే అన్న విషయం ఏకంగా నిరూపితమైంది. కాలిఫోర్నియాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఇలా అడవుల్లో మంటలను అడ్డుకునేందుకే అక్కడ చోయి అనే కంపెనీ 700 మేకలను పోషిస్తుంది. ఇంతకీ ఎలా మంటలను అడ్డుకుంటారంటే.. అడవుల్లో మంటలు వ్యాపించడానికి ప్రధాన కారమైన ఎండు ఆకులు, గడ్డిని మేకలు ఎంతో తేలికగా తినేస్తాయి. ఇక మనుషులు అడవుల్లోకి కొండలపైకి వెళ్లి ఎండిన పదార్థాలను తొలగించడం కష్టం. కానీ ఈ పనులను మేకలు సులభంగా చేయగలవు. అందుకే అక్కడ మేకలు అడవులను కాపాడుతున్నాయట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి