కొత్త సంవత్సరానికి వేలయ్యింది. మరికొన్ని గంటల్లో 2024 సంవత్సరంలోకి ఈ ప్రపంచం మొత్తం అడుగు పెట్టబోతుంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేడుకలకు ప్రపంచం మొత్తం సిద్ధమైపోతోంది అని చెప్పాలి. అయితే కొత్త సంవత్సర వేడుకలు ప్రతి ఏడాది శరమాములుగా మారిపోయాయ్. ఇక అందరూ తమకు నచ్చిన రీతిలో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటూ ఉంటారు. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది డీజే పాటలు పెట్టుకుని డాన్స్ చేయడం లేదంటే ఇక అర్ధరాత్రి 12 దాటిన తర్వాత టపాసులు కాల్చి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది ప్రజలు కొత్త సంవత్సరాన్ని వినూత్నంగా విచిత్రంగా జరుపుకుంటారట.. ఆ వివరాలు చూసుకుంటే..


 డెన్మార్క్  : అక్కడ ప్రజలందరూ కూడా తలుపుల వద్ద పాత ప్లేట్లు గ్లాసులు విసిరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వల్ల చెడు ఆత్మలు అదృశ్యం అవుతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇంటి గుమ్మంలో ఎంత పగిలిన పాత్రలు పేరుకుని ఉంటే  అంత మంచి జరుగుతుందని నమ్ముతారట.


 అమెరికా : అమెరికాలోని జనాలందరూ కూడా ఎక్కువగా టీవీలు ఆన్లైన్లకు అతుక్కుపోతారు. ఎందుకంటే న్యూయార్క్ టైం స్క్వేర్ లో జరిగే బాల్ డ్రాప్ ఈవెంట్ అందుకు కారణం. ప్రత్యేకంగా రూపొందించిన బాల్ ను 31వ తేదీన వన్టైమ్స్ స్క్వేర్ పై నుంచి 11: 59 గంటలకు డ్రాప్ చేస్తారు. ఇక దీనిని ప్రతి ఒక్కరు కూడా టీవీలు ఆన్లైన్ లో వీక్షిస్తారట.

 బ్రెజిల్ : కొత్త సంవత్సర సందర్భంగా అక్కడి ప్రజలందరూ ప్రత్యేకమైన లోదుస్తులు ధరిస్తారట. ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం వస్తుందని అక్కడ ప్రజలు నమ్ముతుంటారట.

 ఫిన్లాండ్ : నూతన సంవత్సర సందర్భంగా కరిగిన టిన్ ను కరిగించి నీటిలో ముంచి లోహం గట్టిపడిన తర్వాత లోహానికి ఆకారంగా మార్చే ప్రక్రియను చేపడుతారట. ఈ లోహం గుండె లేదా ఉంగరం ఆకారాన్ని తీసుకుంటే అది వివాహం జరగడానికి చిహ్నం అని నమ్ముతారట. ఇక మెటల్ ఓడ రూపాన్ని తీసుకుంటే అది ప్రయాణంతో ముడిపడి ఉంటుందని భావిస్తారట.


 స్పెయిన్ : స్పెయిన్ దేశంలో కొత్త సంవత్సరం రోజు పాటించే సాంప్రదాయం మరింత విచిత్రంగా ఉంటుంది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయం ఉంది. ఇక ఈ 12 ద్రాక్షలు 12 నెలలు అదృష్టంతో ముడిపడి ఉంటుందని.. అక్కడ ప్రజలను నమ్ముతారట. జనాలు అందరూ కూడా 12 ద్రాక్షలతో ఏకంగా సమూహంగా ఆరగించేందుకు ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి: