ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం మొత్తం పాకిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ నలుమూలల్లో ఎక్కడో జరిగిన విషయాలను కూడా కేవలం నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ తో కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మొత్తం చుట్టెయ్యగలుగుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక ఇలా వెలుగులోకి వచ్చే విషయాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో పాటించే వింతైన సాంప్రదాయాలు ఆచారాలు కూడా అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇలాంటి ఆచారాల గురించి తెలిసిన నేటిజన్స్ కొన్ని కొన్ని సార్లు షాక్ లో మునిగిపోతూ ఉంటారు అని చెప్పాలి  ఇక ఇప్పుడు ఇలాంటి ఒక వింత ఆచారం కు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఎవరైనా బాగా చదువుకుని మంచి ఉద్యోగమో.. వ్యాపారమో సంపాదిస్తే వారిని సమర్ధుడు అని అందరూ ప్రశంసలు కురిపించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ తెగలో మాత్రం ఏకంగా చదువుతో కాదు ఎవరైతే ఎక్కువ పొడవాటి కర్రలపై నిలబడతాడో ఇక వారిని సమర్ధుడు అని పిలుస్తూ ఉంటారట. ఆఫ్రికా దేశమైనా ఇథియోపియాలో ఇలాంటి వింత సంస్కృతి కొనసాగుతుందట.


 అయితే అక్కడి ప్రజలందరూ ఎక్కువగా వ్యవసాయం, పాడి, వేట పైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ తెగలో పశువులను కాసే బాధ్యతలను కేవలం పిల్లలకు అప్పచెప్పుతారట. అయితే ఇలా పశువులను కాసేందుకు వెళ్లే పిల్లలు ఎత్తయిన కర్రలపై నడుస్తూ ఉంటారట. విశ్వసర్పాలు క్రూర మృగాల బారిన పడకుండా పశువులను కాసేలా ఇక ఇలాంటి సంస్కృతిని పాటిస్తారట. అంతేకాదు వీరిలో ఎవరైతే ఎత్తైన కర్రలపై సునాయాసంగా నడుస్తారో.. వారు అత్యంత బాధ్యత కలిగిన వారిని అంతేకాదు అందరికంటే సమర్థులు అని అక్కడి తెగ ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri