రైతులకు ఆర్థికంగా సహాయం చేసేందుకు ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మూడు విడతలుగా నిధులను విడుదల చేసింది. అయితే నాలుగో విడతకు సంబంధించిన నిధులను విడుదల చెయ్యాలంటే ఎన్నో నిబంధనలను పెట్టింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తుంది.                         

                       

ఈ రూ.6,000 ఒకేసారి కాకుండా విడదల వారీగా రైతుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది. మూడు విడతలు సంబంధించి ఇంతవరుకు ఎలాంటి నిబంధనలు పెట్టకపోగా ఇప్పుడు నాలుగో విడతకు నిబంధనలు పెట్టి చివరికి ఈరోజు ఆ డబ్బుని జమ చేసింది. ఈ నాలుగో విడత నిధులు కావాలంటే బ్యాంక్ ఖాతాను ఆధార్‌కు తప్పనిసరిగా అనుసంధానం చెయ్యాలని వచ్చిన వార్తలు నిజమే.                  

                   

ఈ నేపథ్యంలోనే ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి సంబంధించిన నిధులు విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పటికే 3 విడతల్లో నిధులు జమ అయ్యాయి.. కాగా తాజాగా నాలుగో విడత నిధులు రైతుల ఖాతాలకు ఇప్పటికే చేరుతున్నాయి. ఈ పథకం కింద కేంద్రం ఏడాదికి మొత్తం రూ.6 వేల చొప్పున అర్హులైన రైతులకు సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్తం ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ స్కీమ్‌ను లాంచ్ చేసింది. అయితే ఈ స్కీంతో ఎంతో మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఆర్ధికంగా ఈ స్కీమ్ ఎంతో మంచి చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: