పైకి ఎన్ని నీతి కబుర్లు చెప్పుకున్నా.. రాజకీయ నాయకుల అంతిమ లక్ష్యం అధికారమే.. దీన్ని కాదనేవారే ఉండరు. కాకపోతే.. అధికారానికి ప్రజాసేవ అనే అందమైన ముసుగు వేసుకోవడం రాజకీయనాయకులకు వెన్నతో పెట్టిన విద్య.. కానీ కొందరు మాత్రం నేరుగా విషయం చెప్పేస్తుంటారు. అందుకు అనుభవ లేమి కొంత కారణమైతే.. మనసులో ఉన్న మాట చెబితే తప్పేంటన్నది మరో లాజిక్. ప్రతిపక్షనేత జగన్ విషయం కూడా అంతే.. తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడని ఆయన డైరెక్టుగా చెప్పేస్తారు..              ఎన్నికల ముందు తాను ముఖ్యమంత్రి కాబోతున్నానని.. అయ్యాక కష్టాలు తీరుస్తానని జగన్ ఎన్నోసార్లు చెప్పాడు.. బహిరంగసభల్లో, ఓదార్పు యాత్రల్లో జనానికి హామీ ఇచ్చాడు. అందుకోసం సీరియస్ గానే ట్రై చేశాడు. ఫలితం దక్కలేదు. పోనీ హంగు లాంటి సీన్ ఏమైనా ఉందా.. పదిమంది ఎమ్మెల్యేలను కొనేస్తే పనైపోతుందా అంటే అందుకు కూడా ఆస్కారం లేదు. అధికారం దక్కాలంటే మళ్లీ ఐదేళ్లు ఆగాల్సిందే.. కానీ.. అంతకాలం వెయిట్ చేసే ఓపిక లేదో.. ఏమో తెలియదు కానీ.. జగన్ సోమవారం ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.            చంద్రబాబు ప్రభుత్వం మహా ఐతే.. మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండదని జగన్ నేరుగా చెప్పేశారు. మరి ఊరికే అలా అంటే ఎలా.. ఏదో ఒక సపోర్టింగ్ ఇష్యూ ఉండాలిగా.. అందుకే ఆమాట తాను చెబుతున్నది కాదనీ.. చాలామంది జ్యోతిష్యులు చెబుతున్నారని జగన్ సమర్థించుకుంటున్నారు. జ్యోతిష్కులు చెప్పినదాని ప్రకారం చంద్రబాబు మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండరట. చంద్రబాబు కాకపోతే.. వేరే ఆప్షన్ తాను తప్ప వేరెవరూ లేరన్నది జగన్ కాన్ఫిడెన్స్ కావచ్చు.. మరి జగన్ కంటున్న ఈ పగటి కలలు ఫలిస్తాయా.. రెండేళ్ల తర్వాత రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి అవుతాడా.. ఏమో ఎవరు చెప్పగలరు..గుర్రం ఎగురావచ్చు.. జగన్ సీఎం కానూవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: