దేశంలో ఇప్పుడు క‌రోనా విశ్వ‌రూపం చూపిస్తోంది. ఎప్పుడు ఎవ‌రిని ఎలా బ‌లి తీసుకుంటోందో తెలియ‌ట్లేదు. కరోనా ఎక్క‌డ సోకుతుందో అనే భయంతో అటు ప్ర‌భుత్వాలు, ఇటు ప్ర‌జ‌లు గంద‌ర‌గోళంలో ఉన్నారు. దొరికిందే సందు అన్న‌ట్ట‌తు ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో నకిలీ డాక్టర్లు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇప్ప‌టికే ఎన్నో ఆస్ప‌త్రుల‌పై యాక్ష‌న్ తీసుకున్న‌ప్ప‌టికీ ఇంకా ఇలాంటి ఫేక్ డాక్ట‌ర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు.

ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని షాద్ నగర్ లో కూడా ఇలాంటి ఓ నకిలీ డాక్టర్ అరెస్ట్ కావ‌డం సంచ‌ల‌నం రేపింది. ఎంబీబీఎస్ డాక్టర్ నంటూ అవతారం ఎత్తిన వార్డ్ బాయ్ గా ప‌నిచేసే ప్రవీణ్ చివ‌ర‌కు క‌ట‌క‌టాల పాల‌య్యాడు. తాను డాక్ట‌ర్ నంటూ కొవిడ్ ట్రీట్ మెంట్ చేస్తాన‌ని పేషెంట్ల ద‌గ్గ‌రి నుంచి లక్షలు తీసుకుంటున్నాడు. అయితే ఇక్క‌డే మ‌నోడు మిస్టేక్ చేశాడు.

ఎంబీబీఎస్ పట్టా లేకుండానే డాక్ట‌ర్‌గా ప్రవీణ్ ట్రీట్‌మెంట్‌ చేస్తున్నాడు. దీంతో ఇది గ‌మ‌నించిన షాద్ నగర్ ప్ర‌జ‌లు పోలీస్ స్టేషన్ లో పలు ఫిర్యాదులు చేశారు. అంతే పోలీసులు వ‌చ్చి మ‌నోడి మీద 420, 336 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు రిజిస్ట‌ర్ చేసి అరెస్ట్ చేశారు. దీంతో పాటు పోలీసుల‌కు అందిన వివిధ ఫిర్యాదులతో షాద్ నగర్ లో ఉన్న అమ్మ హాస్పిటల్ ను మూసేసారు.

డిప్యూటీ DMHO ఈ యాక్ష‌న్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ పేరుతో ప‌లువురు పేషెంట్ల‌ను సీరియస్ స్టేజ్ దాకా తీసుకెళ్లిడంతో ప్రవీణ్ పై ఫిర్యాదులు వ‌చ్చాయి. ఈఎన్టీ డాక్టర్ ఎమ్‌.ప్రవీణ్ కుమార్ అనే పేరుతో ఫేక్ లైసెన్స్ తీసుకుని తానే ఒరిజినల్ ప్రవీణ్ కుమార్ గా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు. కాగా అనుభవం లేని డాక్ట‌ర్లను తీసుకొచ్చి ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న డాక్టర్స్ అంటూ వైద్యం చేపిస్తున్నాడు ప్ర‌వీణ్‌. ఇక గతంలోనూ మ‌నోడు మహబూబ్ నగర్ లోని నవోదయ హాస్పిటల్ లో వార్డ్ బాయ్ గా ప‌నిచేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: