అంత స్పీడ్ ఏంటన్నా ?

ప్రభుత్వాలు హడావిడిగా ఉత్తర్వులు ఇవ్వడం, ఆ తరువాత ఇచ్చిన జీవోల పై పునరాలోచనలో పడడం  ఆంధ్ర ప్రదేశ్ లోమామూలైపోయింది. ఎన్నికల షెడ్యూల్ జారీ  చేసిన తరువాత  విడదల అయ్యే  జీవో లు పరిగణలోకి రావు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్ర ప్రదేశ్ లోని  కడప జిల్లా బద్వేలు నియోజక వర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల  విడుదలైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం బద్వేలుకు సంబంధించి ఒక కీలక జీవోను తీసుకు వచ్చింది.  ఎన్నికల  షెడ్యూల్ విడదల  అయిన   రోజే ఈ జీవో విడదల కావడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
పరిపాలనా సౌలభ్యం కోసం గతంలో   ఉన్న రెనిన్యూ డివిజన్ లకు అదనంగా మరికొన్ని రెవిన్యూ డివిజన్ లను ఏర్పాటు  చేయడం గతం నుంచీ క్రమం తప్పకుండా జరుగుతోంది.   జనాభా పెరగడం, వైశాల్యం  ఎక్కువగా ఉండటం, రెవిన్యూ పరంగా సమస్యలు పరిష్కరించడం కోసం నూతన రెవిన్యూ డివిజన్ లు ఏర్పాటవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికీ పోలీస్ డివిజన్ వేరు, రెవిన్యూ డివిజన్ వేరు వేరుగా ఉన్నాయి.  వాటి రెండింటి సరిహద్దులూ ఒకటే ఉన్న ప్రాంతాలు  రాష్ట్రంలో చాలా తక్కువ.  కడప జిల్లా బద్వేలు కేంద్రంగా చేస్తూ రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయలని ప్రభుత్వం ప్రతిపాదన ఎప్పటి నుంచో  పెండింగ్ లో ఉంది. దీనిపై అడుగులు ఇప్పటి వరకూ పడలేదు.   పాలనా పరమైన మార్పులు తీసుకు రావాల్సి వస్తే అందుకు  ప్రజాభిప్రాయ సేకరణ తప్పని సరి. ఇది ప్రహసనంతో కూడుకున్న పని కావడంతో సహజంగా ప్రభుత్వం యంత్రంగం చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తుంది.
కడప జిల్లా లో రెవిన్యూ డివిజన్ లను పునర్ వ్యవస్థీకరణకు  ప్రభుత్వం ప్రాథమిక ఉత్తర్వులు ఇచ్చింది.  నూతన జీవో ప్రకారం బద్వేలు లో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఈ డివిజన్ పరిధిలోకి కడప  రెవిన్యూ డివిజన్ పరిధిలోని రెండు మండలాలను,  రాజం పేట రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలను, జమ్మల మడుగు డివిజన్ నుంచి రెండు మండ లాలను విడగొట్టి నూతంగా బద్వేలు డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. దీని పై  అభ్యంతరాలను తెలపాలని ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. నెల రోజుల లోపల  తమ ఫిర్యాదులను లిఖిత పూర్వకంగా తెలపాలని ఆ ఉత్తర్వులో పేర్కొ న్నారు.
ఓ వైపు ఎన్నికల వేడి ఆరంభమైన నేపథ్యంలో  ప్రజలు దీనిపై ఎలా స్పందిస్తారో ? ఏమని అభ్యంతరం పెడుతారో ? చూడాలి మరి.  ఉప ఎన్నిక షెడ్యూల్,  నూతన రెవిన్యూ డివిజన్ ఏర్పాటు పై  ప్రకటన ఎక కాలంలో రావడంతో ఈ విషయం ఆంధ్ర ప్రదేశ్ లో చర్చనీయాంశమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: