సాక్షాత్తు భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించిన కూడా అధికారులు మాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వాలకు అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు ఈ రోజైనా శిక్ష అనుభవించాల్సిందే అంటూ సరిగ్గా 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ అక్రమాస్తులు కూడబెట్టుకున్న వాళ్లకి ఎలాంటి  రక్షణ కల్పించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై లేదని కూడా తేల్చి చెప్పారు. ఐఏఎస్ లైనా, కిందిస్థాయి ఉద్యోగుల అయిన ఎవరైనా సరే ప్రజా సేవకులు అని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో గూగుల్ రేపుతున్నాయి. కానీ కొంతమంది అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. కనీసం కనువిప్పు కలిగినట్లుగా లేదు కొంతమంది ఉద్యోగులకు.

తాజాగా అనంతపురం జిల్లా గుత్తి సిఐ రాము చేసిన వ్యాఖ్యలు మరోసారి అధికారుల తీరును బయట పడుతున్నాయి. బహిరంగ సభలో గుంతకల్ ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు సిఐ రాము. ఒక దశలో మీ అంతటి వారు లేరంటూ కీర్తించారు. మీరే మా దేవుడు అన్నట్లుగా సి ఐ రాము.. వెంకట్ రామిరెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. మేము చెప్పకుండానే మా సమస్యలు మీరు తీరుస్తారని మీ లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండటం గుంతకల్ ప్రజల అదృష్టం అంటూ సిఐ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి... అదికూడా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారి ఈ విధంగా రాజకీయ నాయకులకు అనుకూలంగా మాట్లాడడం... వారిపై పొగడ్తల వర్షం కురిపించడం... ఎంతవరకు సబబు అని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించిన సి ఐ రాము పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులకు ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కొంత మంది అధికారుల తీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోందని సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే చెబుతున్నా కూడా... అధికారులు ఇలా బహిరంగంగానే భజన చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: