ఇప్పుడు చెప్పబోయే మాట వింటే ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇన్నాళ్లు తెలంగాణకే పరిమితమైన ఆ దిగ్గజ ఉద్దండ నాయకుడు  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అంటూ ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేసుకుంటారు. నిజం కావాలని కొందరు, అంత సినిమా లేదని మరికొందరు. కెసిఆర్ ఇక దేశానికి ఉపరాష్ట్రపతి. అదేంటి ఎవరికీ తెలియకుండా మూడో కంట పడకుండా ఇది ఎప్పుడు ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమైన నికార్సయిన వాస్తవం కాదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకానొక వార్త. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో కేంద్రం టాపిక్ గురించి అదేవిధంగా రెండు సార్లు ఢిల్లీ టూర్ వెళ్లిన కేసీఆర్  కొన్ని విషయాలపై కేంద్ర పెద్దలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన కుమారుడు కేటీఆర్ ని తెలంగాణ ముఖ్యమంత్రి చేసే ఆలోచనలు కూడా వాళ్లతో చర్చించారు. కెసిఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో మార్పులుస్పష్టంగా కనిపిస్తున్నాయి.

తెలంగాణపై ప్రభుత్వం తరఫున ఇక్కడి ప్రజలపై వరాలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ రాజకీయాలపైన కన్ను వేస్తూ చక్రం తిప్పే ఆలోచనకు పదును పెడుతున్నారట. ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల తో పాటు కేంద్ర మంత్రులతో  కలిసారు. ఉపరాష్ట్రపతి కావాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారట. బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందన్న వార్తలు ఇప్పుడు చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఉప రాష్ట్రపతి  గా ఉన్న వెంకయ్య నాయుడు స్థానంలో ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత దానిలో మరో తెలుగు వ్యక్తిగా దక్షిణాదికి చెందిన ఉద్దండ రాజకీయ చతురత కలిగిన కెసిఆర్ కు కచ్చితంగా అవకాశం వస్తుందన్న ప్రచారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద జోరుగా జరుగుతోంది. ఉపరాష్ట్రపతి అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బిజెపితో కలిసే అభ్యంతరం కెసిఆర్ కు ఉండక పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

కెసిఆర్ కు ఉప రాష్ట్రపతి పదవి వస్తే తెలంగాణలో కేటీఆర్ కు లైన్ క్లియర్ అయినట్లే అని అంటున్నారు. కెసిఆర్ ఢిల్లీ వెళ్ళిన మొదటి విషయం కేటీఆర్ తెలంగాణ సీఎం కావడం ఖాయం అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇటు పార్టీ అటు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ఇబ్బందులు పడకుండా  తన మేనల్లుడు ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావును కేంద్ర కేబినెట్ లోకి పంపాలని కూడా కెసిఆర్ డిసైడ్ అయ్యారని చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: