విద్యుత్ ప్లాంట్ల నిర్వ‌హ‌ణ పై శ్ర‌ద్ధ లేదు. లేని కార‌ణంగానే వినియోగ భారం అన్న‌ది ప‌రిష్కారం కావ‌డం లేదు. క‌రోనా త‌రువాత కోలుకున్న రంగాల‌ను  చూసి ఆనందించాలి కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వాటిపై కూడా మొట్టికాయ‌లు వేస్తోంది. ఇదేం విడ్డూరం. కొత్త‌వి రావు ఉన్న‌వి న‌డ‌వ‌వు ఇలా ఉంది జ‌గ‌న్ స‌ర్కారు అన్న విమ‌ర్శ మాత్రం సుస్ప‌ష్టంగా విప‌క్షం నుంచి వినిపిస్తుంది. ఈ ద‌శ‌లో ఒక్క‌టే మార్గం అధిక ధ‌ర‌ల‌కు విద్యుత్ కొనుగోలు చేసి, త‌రువాత ఆ మొత్తాల‌ను స‌ర్దుబాటు ఛార్జీల పేరిట బాద‌డ‌మే!


బొగ్గు ఉత్ప‌త్తి చేసే సంస్థ‌ల‌కు అప్పు ఉంది ఏపీ సర్కారు. దీనిని వెంట‌నే తీర్చాలి లేక‌పోతే స‌ర‌ఫ‌రా ఉండ‌దు. మ‌న‌కు ల‌క్ష కోట్ల సంక్షేమ‌మే త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రాదు క‌దా క‌నుక అప్పు తీర్చ‌డం సులువు కాదు అని తేలిపోయింది. ఇంకేం ఉంది బొగ్గు స‌ర‌ఫ‌రా అన్న‌ది మ‌న‌కు రాకుండా పోయింది. దీంతో ఉత్ప‌త్తి రంగాలు అన్నీ దివాళా తీసేందుకు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌నరుల నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి  కూడా అంతంత మాత్ర‌మే క‌దా! మ‌న ద‌గ్గ‌ర‌..ఇంకేం ఉంది.. మ‌నం హాయిగా చీక‌ట్ల‌ను చూసి ఆనందించాలి. లేదా ఇదే క‌దా సంక్షేమ ప్ర‌గ‌తి అని కూడా అనుకోవాలి. జ‌గ‌న్ రావాలి అన్న‌ది నినాదం
ఇప్పుడిప్పుడే త‌న‌ఖాల్లోకి రాష్ట్రం పోతుంటే విచారం..



కరోనా త‌రువాత వినియోగం అమాంతంగా పెరిగిపోయింది. ఉత్ప‌త్తి మాత్రం గ‌ణ‌నీయంగా ప‌డిపోయింది. గ‌తంలో క‌న్నా ఇప్పుడే ఎక్కువ‌గా ప‌రిశ్ర‌మ‌లు విద్యుత్ వినియోగం చేస్తున్నాయి. అంతేకాకుండా క‌రోనా న‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతున్నాయి. ఇదే సంద‌ర్భంగా సాయంత్రం ఆరు నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ విద్యుత్ పొదుపుపై దృష్టి సారించాల‌ని కోరుతున్నారు  ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణా రెడ్డి. ఆయ‌న మాట అమ‌లు ఎలా ఉన్నా ఇప్ప‌టికిప్పుడు సంక్షోభం త‌ప్పేలా లేదు. బొగ్గు నిల్వ‌లు లేని కార‌ణంగానే విద్యుత్ ఉత్ప‌త్తిపై ప్ర‌భావం ఊహించని రీతిలో ప‌డింద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇదే స‌మయంలో త‌ప్పు మోడీ స‌ర్కారుపై నెట్టేద్దామ‌ని జ‌గ‌న్ చాలా ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లున్నా అవేవీ నిజం కావ‌ని కేంద్ర మంత్రి చెబుతున్న మాటే సాక్ష్యం. ఈ ప‌రిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధి మ‌రో ప‌దేళ్ల‌కు ప‌డిపోవ‌డం ఖాయం. వెనక్కుపోవ‌డం ఖాయం. మ‌రోవైపు దేశీయ బొగ్గు అన్న‌ది పెద్ద‌గా ల‌భ్యం కావ‌డం లేదు. దిగుమ‌తిపైనే ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. ఒక‌వేళ ధ‌ర ఎక్కువ‌గా ఉంటే ఉత్ప‌త్తి కంపెనీలు కొనుగోలు నిలిపివేసి, పూర్తిగా ప్లాంట్ల‌ను మూసి వేస్తున్నారు. ఇవ‌న్నీ కేంద్రం మానిట‌రింగ్ చేస్తున్నా కూడా స‌మ‌స్య మాత్రం ఒడ్డెక్క‌డం లేదు. అంతర్జాతీయంగానే బొగ్గు ధ‌ర ఎక్కువ‌గా ఉంది అని, ఇదే ప్ర‌భావం సంబంధిత ప్లాంట్ల‌పై ఉంద‌ని తెలుస్తోంది. ఇవ‌న్నీ గుర్తించకుండానే రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రంపై అభియోగాలు మోపుతోందా.? లేకా అన‌వ‌స‌ర రాద్ధాంతంతో ఒడ్డెక్కాల‌ని చూస్తుందా?

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp